బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
వరంగల్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఎలుకల బెడద తీవ్రంగా ఉంది. బాలింతలు, పసిపిల్లలు ఎలుకల దాడులకు గురవుతున్నారు, ఇంక్యుబేటర్ వార్డులోనూ పసిబిడ్డలకు గాయాలవుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రోగులు, వారి బంధువులు భయాందోళన చెందుతున్నారు. పసిపిల్లల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది.
ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి పై ఎలుకలు దండయాత్ర చేస్తున్నాయి. బాలింతలను హడలెత్తిస్తున్న ఎలుకలు పసిపిల్లలను గాయపరుస్తున్నాయి. ఇన్ పేషెంట్ వార్డులో ఎలుకల స్వైర విహారం ఆ తల్లులను ఉక్కిరి బిక్కిరిచేస్తుంది. అక్కడ పేషెంట్స్ సంఖ్య కంటే ఎలుకల సంఖ్యే ఎక్కువగా కనిస్తుంది. పురిటినొప్పులతో ఆసుపత్రికి వచ్చే గర్భిణిలు, డెలివరీ అయిన బాలింతలు.. ఎలుకల బెడదనుండి తమను తమ పిల్లలను కాపాడండి మొర్రో అని మొత్తుకుంటున్నారు. వరంగల్ నగరంలోని సికేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఇన్ పేషెంట్ వార్డులో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. పసిపిల్లల ఆరోగ్యం మెరుగవడం కోసం ట్రీట్మెంట్ అందించే ఇంక్యుబేటర్ వార్డులో ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. పసిపిల్లల తల్లులు కాస్త ఏమరపాటుగా ఉంటే చాలు రక్కి గాయపరుస్తున్నాయి . తమ పిల్లలను ఎలుకలబారినుంచి కాపాడుకోడానికి బాలింతలు, వాళ్ళ అటెండెన్స్ కాపలా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలుకల బారి నుండి పసిపిల్లల ప్రాణాలు కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు ఈ తల్లులు. గతంలోనూ ఎలుకలు పసిపిల్లలను గాయపరచడం, బాలింతల గోర్లు కొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకలు ఏకంగా మాజీ సూపరింటెండెంట్ పోస్ట్ కే ఎసరు పెట్టాయి. అలాంటి నిర్లక్ష్యమే ఈ ప్రసూతి ఆస్పత్రిలోనూ కనిపిస్తుంది. అయినా సిబ్బంది నిర్లక్ష్యం మాత్రం వీడడం లేదు. ఇన్ పేషెంట్ వార్డులో ఇంత విచ్చలవిడిగా ఎలుకలు దండుకట్టి దర్జాగా తిరుగుతున్నాయి. వాటి నియంత్రణపై చర్యలు కనిపించడం లేదు. ఫలితంగా బాలింతలు, గర్భిణీ స్త్రీలు, వాళ్ళ బంధువులు ఈ ప్రసూతి ఆస్పత్రి పేరు చెప్తేనే గజగజ వనికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇంకుబెటర్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ పసిబిడ్డ తండ్రి ఈ వాస్తవ దృశ్యాలను వీడియో తీసి మీడియా దృష్టికి తీసుకువచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..
పదిహేనేళ్ల నిరీక్షణ ఫలితం.. రూ.61 కోట్లు
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
మెట్రో రైలు .. ట్రాక్‌పై నడిచిన ప్రయాణికులు
డిగ్రీ కన్నా నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం..
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..
పదిహేనేళ్ల నిరీక్షణ ఫలితం.. రూ.61 కోట్లు

