పదిహేనేళ్ల నిరీక్షణ ఫలితం.. రూ.61 కోట్లు
సౌదీలో నివసిస్తున్న కేరళకు చెందిన పీవీ రాజన్, అబుదాబి 'బిగ్ టికెట్' డ్రాలో రూ. 61.37 కోట్లు (25 మిలియన్ దిర్హామ్‌లు) గెలుచుకున్నారు. 15 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న రాజన్‌కు ఈ బహుమతి లభించింది. ఈ భారీ మొత్తాన్ని తన 15 మంది సహోద్యోగులతో పంచుకుంటానని ఆయన ప్రకటించారు. గల్ఫ్ దేశాలలో భారతీయులు లాటరీలు గెలవడం ఇటీవల సాధారణమైంది.
బ్రతుకుతెరువు కోసం విదేశాలకు వెళ్లే భారతీయులు జాక్‌పాట్‌లు కొడుతున్నారు. ఇప్పటి వరకూ విదేశాలకు వెళ్లి అక్కడ అష్టకష్టాలూ పడుతూ.. తమను స్వదేశానికి రప్పించాలంటూ ప్రభుత్వాలను వేడుకొన్న ఘటనలు నెట్టింట చాలా చూశాం. నాణేనికి రెండోవైపు అన్నట్టుగా విదేశాలకు వలస వెళ్లిన కొందరు జాక్‌పాట్‌లు కొడుతూ అదృష్టవంతులవుతున్నారు. తాజాగా సౌదీ అరేబియాలో నివసిస్తున్న మరో భారతీయుడిని అదృష్టం వరించింది. కేరళకు చెందిన పీవీ రాజన్, అబుదాబిలో నిర్వహించిన ‘బిగ్ టికెట్’ లక్కీ డ్రాలో ఏకంగా 25 మిలియన్ దిర్హామ్‌లు అంటే..భారత కరెన్సీలో సుమారు రూ.61.37 కోట్లు గెలుచుకున్నారు. 15 సంవత్సరాలుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్న ఆయనకు ఎట్టకేలకు ఈ భారీ జాక్‌పాట్ తగిలింది. పీవీ రాజన్ నవంబర్ 9న ఓ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. తాజాగా నిర్వహించిన సిరీస్ 281 డ్రాలో ఆయన టికెట్‌కే మొదటి బహుమతి లభించింది. లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి ఈ శుభవార్తను అందించగా రాజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తనకు చాలా సంతోషంగా ఉందని, ఈ ప్రైజ్ మనీని తాను ఒక్కడినే వుంచుకోనని, తన 15 మంది సహోద్యోగులతో సమానంగా పంచుకుంటానని ఆయన ప్రకటించారు. గత సిరీస్ విజేత, మరో భారతీయుడైన శరవణన్ చేతుల మీదుగా ఈ డ్రా తీయడం విశేషం. ఇదే డ్రాలో మరో 10 మంది కన్సోలేషన్ బహుమతులు అందుకున్నారు. వీరికి తలా 10,000 దిర్హామ్‌లు అంటే రూ.2.45 లక్షలు లభించగా, వారిలోనూ ముగ్గురు భారతీయులు ఉండటం గమనార్హం. గల్ఫ్ దేశాల్లో భారతీయులకు లాటరీ తగలడం అన్నది ఇటీవల సాధారణమైపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akhanda 2: అఖండ 2 ముందున్న అతిపెద్ద సవాల్ అదే
సంక్రాంతికి నేనూ ఉన్నాను అంటున్న సిక్స్ ప్యాక్ హీరో
పదిహేనేళ్ల నిరీక్షణ ఫలితం.. రూ.61 కోట్లు
11 ఏళ్ల చిన్నారి చిరుతతో పోరాటం.. అదే అతనికి రక్షణ కవచమైంది
ఈ స్వామికి పానకం అంటే ఎంతిష్టమో.. నెలకు 50 వేల లీటర్ల
24 గంటలకు కాదు.. అక్కడ 64 రోజులకు సూర్యోదయం
జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో
ఏలియన్స్‌కు టెంపుల్ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు
ఆ గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరీ..కారణం తెలిస్తే షాకే !

