11 ఏళ్ల చిన్నారి చిరుతతో పోరాటం.. అదే అతనికి రక్షణ కవచమైంది
మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో 11 ఏళ్ల మయాంక్ చిరుత దాడిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. స్కూల్ బ్యాగ్ రక్షణగా నిలవగా, మిత్రుడి సాయంతో రాళ్లు విసురుతూ, అరుస్తూ చిరుతను తరిమికొట్టాడు. ఈ ఘటనలో చిన్నపాటి గాయాలయ్యాయి. అటవీ అధికారులు అప్రమత్తమై పాఠశాలల వేళల్లో మార్పులు, AI కెమెరాల ఏర్పాటు, గ్రామస్థులకు అవగాహన వంటి చర్యలు చేపట్టారు.
మహారాష్ట్రలో ఓ 11 ఏళ్ల విద్యార్థి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా చిరుత పులి వెంబడించింది. భయంతో వణికిపోకుండా ఆ బాలుడు తన స్నేహితుడి సహాయంతో చిరుత పులి పై రాళ్లు విసురుతూ, గట్టిగా అరుస్తూ చిరుత దాడిని తిప్పికొట్టాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘటన జరిగింది. పద్విపాడు ప్రాంతంలో మయాంక్ కువారా.. తన స్నేహితుడితో కలిసి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా మయాంక్‌పైకి చిరుత దూకింది.. అతని వీపుపై ఉన్న స్కూల్ బ్యాగ్ రక్షణ కవచంగా పనిచేసి, పెద్ద ప్రమాదం నుంచి అతన్ని కాపాడింది. మయాంక్, అతని స్నేహితుడు భయపడకుండా గట్టిగా అరుస్తూ, చేతికి దొరికిన రాళ్లను చిరుతపైకి విసిరారు. పిల్లల అరుపులు విని చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తమై పరిగెత్తుకు వచ్చారు. జనం రావడం చూసిన చిరుత భయపడి తిరిగి అడవిలోకి పారిపోయింది. మయాంక్ చేతికి చిరుత పంజా గాయమైంది. వెంటనే అతడిని రూరల్ ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు ఆ గాయానికి కుట్లు వేసి చికిత్స చేసారు. ప్రస్తుతం ఆ చిన్నారి గాయం నుంచి కోలుకుంటున్నాడు. మయాంక్ కువారా ఘటనను సీరియస్‌గా తీసుకున్న అటవీ అధికారులు.. చిరుత పులులు సంచరించే ప్రాంతాల్లోని పాఠశాలలను సాయంత్రం 4 గంటలకే మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. చిరుత కదలికలను ట్రాక్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కెమెరాను ఏర్పాటు చేస్తున్నారు. ఇక చిరుతల సంచారం ఉండే గ్రామాల్లో డప్పు కొట్టి చెబుతూ గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kalki 02: కల్కి 2లో దీపిక ప్లేస్ రీ ప్లేస్ చేసేదెవరో తెలుసా ??
భోజనం తర్వాత వాకింగ్ చేస్తున్నారా..! ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
రాత్రి గోళ్లు కట్ చేయకూడదు.. చాదస్తం కాదు ..సైంటిఫిక్ రీజన్ ఉంది
11 ఏళ్ల చిన్నారి చిరుతతో పోరాటం.. అదే అతనికి రక్షణ కవచమైంది
ఈ స్వామికి పానకం అంటే ఎంతిష్టమో.. నెలకు 50 వేల లీటర్ల
24 గంటలకు కాదు.. అక్కడ 64 రోజులకు సూర్యోదయం
జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో
ఏలియన్స్కు టెంపుల్ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు
ఆ గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరీ..కారణం తెలిస్తే షాకే !
డైనోసార్ల కాలం నాటి చేపను చూసారా !! ఇంకా బ్రతికే ఉంది

