ఈ స్వామికి పానకం అంటే ఎంతిష్టమో.. నెలకు 50 వేల లీటర్ల
మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఒక అద్భుతం. ఇక్కడ స్వామి వారికి సమర్పించిన పానకంలో సగాన్ని తాగి, మిగిలిన సగాన్ని భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. త్రేతాయుగం నుండి ఉన్న ఈ ఆచారాన్ని ఆలయ అధికారులు తాజాగా వెల్లడించిన లెక్కలు ధృవీకరించాయి. నెలకు లక్ష లీటర్ల పానకంలో 50 వేల లీటర్లు స్వామి స్వీకరిస్తారని తెలిసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు.
vమంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది. ఆలయం పక్కనే ఉన్న కొండలో వెలసిన లక్ష్మీ నరసింహ స్వామికి భక్తులు నిత్యం ఎంతో భక్తిశ్రద్దలతో పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకే ఇక్కడ స్వామిని పానకాల లక్ష్మీ నరసింహ స్వామి అంటారు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే భక్తులు పోసిన పానకంలో సగాన్ని స్వామి వారు తాగి మిగతా సగాన్ని భక్తులకు తిరిగి ఇస్తారు. దానిని భక్తులు ప్రసాదంగా తీసుకుంటారు. స్థల పురాణం ప్రకారం నరసింహస్వామి త్రేతాయుగంలో నమూచి అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత మంగళగిరి కొండ బిలంలో ఉగ్రరూపంలో వెలిశారని చెబుతారు.ఉగ్రరూపంలో ఉన్న స్వామి వారిని శాంతింపచేసేందుకు త్రేతాయుగంలో అమ్రుతాన్ని, ద్వాపర యుగంలో ఆవుపాలను, కలియుగంలో పానకాన్ని సమర్పిస్తున్నట్లు చెబుతారు. ఇంతటి ప్రాశస్త్యం ఉండటంతో ఆలయ అధికారులే పానకాన్ని తయారు చేసి భక్తులకు విక్రయిస్తారు. స్వామి వారు రోజూ ఎంత పానకాన్ని స్వీకరిస్తున్నారు అన్నదానికి సంబంధించిన లెక్కలను ఆలయ అధికారులు విడుదల చేశారు. ఈ లెక్కల ప్రకారం భక్తులు ప్రతీ నెలా లక్ష లీటర్ల పానకాన్ని స్వామి వారికి ఇస్తున్నారు. ఇందులో స్వామి వారు సగం.. అంటే 50 వేల లీటర్ల పానకాన్ని స్వీకరించి మిగిలిన 50 వేల లీటర్ల పానకాన్నీ వదిలేస్తారు. ఇక్కడ పానకాన్ని బిందెల్లో పూజారులు అందిస్తుంటారు. ఒక్కో బిందెలో 2.5 లీటర్ల పానకం పడుతుంది. ఇటువంటి బిందెలు ప్రతీ నెలా 40 వేలు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వామి వారి పానకంపై అధికారులు లెక్కలు విడుదల చేయడంతో భక్తులు దీనిపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
24 గంటలకు కాదు.. అక్కడ 64 రోజులకు సూర్యోదయం
ఈ ఆకులను చీప్‌గా చూడొద్దు.. ఆ వ్యాధికి దివ్య ఔషధం..
జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో
ఈ స్వామికి పానకం అంటే ఎంతిష్టమో.. నెలకు 50 వేల లీటర్ల
24 గంటలకు కాదు.. అక్కడ 64 రోజులకు సూర్యోదయం
జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో
ఏలియన్స్‌కు టెంపుల్ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు
ఆ గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరీ..కారణం తెలిస్తే షాకే !
డైనోసార్ల కాలం నాటి చేపను చూసారా !! ఇంకా బ్రతికే ఉంది
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు

