ఏలియన్స్‌కు టెంపుల్ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు
తమిళనాడులోని సేలం జిల్లాలో ఒక వ్యక్తి గ్రహాంతరవాసికి ఏకంగా ఆలయం కట్టాడు. తన తోటలో శివాలయం నిర్మిస్తూ, అందులో అగతియార్ లాంటి గ్రహాంతరవాసి విగ్రహాన్ని ప్రతిష్టించి నిత్యం పూజలు చేస్తున్నాడు. ఈ వింత ఆలయం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది, నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.
ఏలియన్స్ ఉన్నాయో లేదో ఇంకా ఎవరికీ తెలియదు. ఎగిరే సాసర్ల వంటి వస్తువులును ఆకాశంలో చూశామని కొంతమంది చెప్పడమే తప్పా సరైన ఆధారాలు లేవు. గ్రహాంతర వాసులకు సంబంధించి రూపం ఇలా ఉంటుంది అని ఊహించుకోవడమే తప్పా ఎవరూ ప్రత్యక్షంగా చూసింది లేదు. కానీ తమిళనాడులోని ఓ వ్యక్తి మాత్రం ఏలియన్స్‌కు ఏకంగా ఓ ఆలయమే కట్టేశాడు. ఈ అంశం ఇప్పుడ స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా భక్తులు తమ ఇష్టదైవాలకు గుడి కట్టి ఆరాధిస్తుంటారు. ఇటీవల తమ కుటుంబ సభ్యులను కోల్పోయినవారు కూడా వారిని మరువలేక వారి విగ్రహాలను తయారు చేయించి ఇంటి ఆవరణలో ప్రతిష్టించుకుంటున్నారు. అయితే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఏలియన్‌కి గుడి కట్టి నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. తమిళనాడులోని లోగనాథన్ సేలం జిల్లా మల్లమూపంబట్టికి చెందిన రామకౌండనూర్ అనే వ్యక్తి స్థానికంగా టీ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. శివుడి మీద ఉన్న అపార భక్తితో ఆయన తన తోటలో శ్రీ శివ కైలాయ దేవాలయం పేరుతో ఆలయాన్ని నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. రెండేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించి మొదటగా రాహు రూపంలో విష్ణు మూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేయడం మొదలుపెట్టాడు . దీనికి సమీపంలోనే కింది అంతస్తులో శివలింగాన్ని ఏర్పాటు చేసాడు. ఇందులో భాగంగా అండర్ గ్రౌండ్ ఉన్న స్థలంలో ధ్యానం కోసం ప్రత్యేక మెడిటేషన్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ ధ్యాన మందిరంలో ఆకాశంలో ఎగురుతున్న అగతియార్ లాంటి విగ్రహాన్ని అంటే గ్రహాంతరవాసి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. రోజు విష్ణు మూర్తి , శివలింగాలకు ప్రత్యేక పూజలు చేసినట్టుగానే గ్రహాంతరవాసి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాడు. దీంతో చుట్టుపక్కల గ్రామాలలో ఈ ఆలయం చర్చనీయాంశంగా మారింది. ఏలియన్ టెంపుల్‌ను చూసేందుకు క్యూ కడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరీ..కారణం తెలిస్తే షాకే !
ఏలియన్స్‌కు టెంపుల్ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు
ఆ గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరీ..కారణం తెలిస్తే షాకే !
డైనోసార్ల కాలం నాటి చేపను చూసారా !! ఇంకా బ్రతికే ఉంది
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?

