AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైనోసార్ల కాలం నాటి చేపను చూసారా !! ఇంకా బ్రతికే ఉంది

డైనోసార్ల కాలం నాటి చేపను చూసారా !! ఇంకా బ్రతికే ఉంది

Phani CH
|

Updated on: Dec 08, 2025 | 11:44 AM

Share

డైనోసార్ల యుగం నాటి మంజువారీ చేప, మానవ చర్యల వల్ల అంతరించిపోతోంది. IUCN జాబితాలో చేరిన ఈ 'క్యూబన్ గార్' జాతిని క్యూబా శాస్త్రవేత్తలు జపాటా చిత్తడినేలల్లో కాపాడేందుకు కృషి చేస్తున్నారు. ప్రత్యేక హాచరీలు ఏర్పాటు చేసి, సవాళ్లను ఎదుర్కొంటూ ఈ ప్రాచీన చేప ఉనికిని నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు.

ఇది ఓ చేప మాత్రమే కాదు. దానికో గొప్ప చరిత్ర ఉంది. డైనోసార్ల యుగం నుంచీ ఉనికిని కాపాడు కుంటూ వస్తున్న మొండి ఘటంగా తిరుగులేని రికార్డు దాని సొంతం. మరోలా చెప్పాలంటే అది డైనోసార్లతో రాసుకుపూసుకు తిరిగిన బాపతు. అంటే కనీసం కోటిన్నర ఏళ్ల నాటిదన్నమాట. అత్యంత కఠిన కాలపరీక్షకు కూడా తట్టుకుని నిలిచిన అంతటి మొండి జీవి ఉనికి కాస్తా ఇప్పుడు ప్రమాదంలో పడింది. కారణం? మనిషే. మనిషి పేరాశ పుణ్యమా అని ఆ చేప అంతరించిపోయే జాబితాలో చేరింది. ఆ చేప జాతిని ఎలాగైనా కాపాడాలని క్యూబా సైంటిస్టులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. క్యూబా తీరంలోని చిత్తడి నేల ప్రాంతం జెప్టాలో మంజువారీలు నివాసముంటున్నాయి. పొ డవుగా, సన్నగా, నాజూకుగా, పదునైన పళ్లతో ఉండే ఈ చేప అంతరించే జీవజాలం జాబితాలో ఉంది. పాతికేళ్ల క్రితమే ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) దీన్ని జాబితాలో చేర్చింది. శతాబ్దాల తరబడి మనిషి సాగించిన విచ్చలవిడి వేటే ఇందుకు ప్రధాన కారణం. దాంతో ఈ మంజువారీ దాదాపుగా అంతరించిపోయినంత పనైంది! దాంతో ఒక దశలో దానిపై అంతా ఆశలు వదలుకున్నారు! కానీ ఉన్నట్టుండి 2003లో జెప్టా చిత్తడినేలల్లో ఈ చేప జాతి మళ్లీ కనిపించింది. దాంతో క్యూబా సర్కారు కళ్లు తెరిచింది. దాన్ని ఎలాగైనా కాపాడమని ప్రఖ్యాత జీవ శాస్త్రవేత్త ఆంద్రెస్‌ హర్టాడో బృందానికి అప్పగించింది. ఆయన వెంటనే రంగంలోకి దిగారు. మంజువారీ చేపలను విడిగా పెంచేందుకు చిత్తడి నేల సమీ పంలోనే యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రత్యేక హాచరీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు స్థానిక మత్స్యకారులు తమకు మంజువారీలు తరచూ కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే, ‘‘అప్పుడే ఆనందించడానికి లేదు. మంజువారీలకు అవసరమైన ఆహారాన్ని బయటి పరిస్థితుల్లో అందుబాటులో ఉంచడం చాలా కష్టమైన పని. ఆ సవాలును పూర్తిగా అధిగమించినప్పుడే నిజమైన ఆశ ఉన్నట్టు. వీటిని అంతరించే జీవుల జాబితా నుంచి కొన్నాళ్ల తర్వాతైనా బయట పడేయడం సాధ్యమని చెప్ప గలమన్నట్టు’’అని వివరించారాయన. క్యూబాలోని చేపల న్నింట్లోకెల్లా మంజువారీ రత్నం వంటిదని గర్వంగా చెబు తారు ఆంద్రెస్‌. అందుకే ఈ చేపను స్థానికులు క్యూబన్‌ గార్‌ అని కూడా మురిపెంగా పిలుచుకుంటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజుకు 15 నిమిషాలు నవ్వితే.. అద్భుత ప్రయోజనాలు