వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు వీడియో
దక్షిణ మధ్య రైల్వే నాలుగు వందే భారత్ రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు చేసింది. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు బుధవారం బదులు శుక్రవారం, సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలు గురువారం బదులు సోమవారం రద్దు అవుతుంది. డిసెంబర్ 14 నుంచి తిరుపతి-సాయి నగర్ శిరిడీ మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ కూడా అందుబాటులోకి రానుంది.
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటూ నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు ప్రకటించింది. రైల్వే బోర్డు ఆమోదించిన ఈ మార్పులు సేవా సామర్థ్యాన్ని పెంచడం, నిర్వహణను క్రమబద్ధీకరించడం, సమయపాలన మెరుగుపరచడం లక్ష్యంగా చేసుకున్నాయి.కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇదివరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు దానికి బదులుగా ప్రతి శుక్రవారం ఈ రైలు సర్వీసులు రద్దు చేయబడతాయి. అలాగే, సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గతంలో గురువారం సర్వీసులు అందించేది కాదు. ఇప్పుడు దీనిని సోమవారానికి రద్దు చేస్తూ షెడ్యూల్లో మార్పులు చేశారు. శుక్రవారం నుంచి ఈ నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. అయితే రైళ్ల టైమింగ్స్, హాల్ట్‌లు, ఫ్రీక్వెన్సీలో ఎలాంటి మార్పులు లేవు. రద్దు చేసిన రోజుల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు రిఫండ్ పొందవచ్చని లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం :
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. తొడగొట్టి సవాలు విసురుతున్న 95 ఏళ్ల యువకుడు వీడియో
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

