ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో
భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లు కూడా ఉత్కంఠగా సాగాయి. రాంచీలో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, రాయ్‌పూర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచింది. దీంతో విశాఖపట్నంలో జరగబోయే మూడో మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించనుంది. అయితే ఈ ప్రయాణానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ముఖ్య ఆటగాళ్లు కూడా తమ సామానును సొంతంగా మోసుకెళ్తూ ఎస్కలేటర్‌పై పైకి ఎక్కడం కనిపిస్తోంది. దీని కారణంగా ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వైరల్ అవుతున్న ఈ వీడియో రాయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించినదని తెలుస్తోంది. టీమిండియా ప్లేయర్లు మూడో వన్డే కోసం రాయ్‌పూర్ నుంచి విశాఖపట్నం బయలుదేరుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కేవలం మూడు రోజుల ముందే భారత, సౌతాఫ్రికా జట్లు ఇక్కడికి చేరుకున్నప్పటికీ, అప్పటికే ఎయిర్‌పోర్టులో ఉన్న ఎస్కలేటర్ పనిచేయడం లేదు. ఎస్కలేటర్ ఆగిపోయి ఉండటంతో, ఆటగాళ్లందరూ దానిపైనే తమ భారీ లగేజీని మోస్తూ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. వీడియోలో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ లగేజీని స్వయంగా తీసుకెళ్తూ కనిపించారు.
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

