టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి రిజిస్ట్రేషన్లు పోటెత్తాయి..! రెండ్రోజుల్లోనే రికార్డు బ్రేకింగ్ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి మూడు రోజులకు సంబంధించి ఆన్ లైన్ ద్వారా ఈ-డిప్ కోసం పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 19.5 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులు.. అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1న ఈ డిప్‌లో టికెట్లు పొందిన వారిని మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన ఏడు రోజులు టోకెన్లు లేని భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తారు. మరోవైపు.. వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి మూడు రోజులు 300రూపాయల దర్శనం, శ్రీవాణి దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా అన్ని రకాల సిఫార్సు దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వైకుంఠ ఏకాదశి రోజున 70వేల మందికి దర్శన ఏర్పాట్లు చేస్తుండగా.. గంటకు 4వేల 300 మందికి దర్శనాలు కల్పించనుంది. ఇక.. ఈ-డిప్‌లో ఎంపికైన భక్తులకు ఫోన్ ద్వారా ఎస్‌ఎంఎస్ పంపనుండగా.. అందులోని లింక్ ఓపెన్ చేసుకుని ఉచిత టోకెన్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

