జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో
ఔరయాలో పానీ పూరి తింటుండగా ఒక మహిళ దవడ జారింది. నోరు మూతపడక తీవ్ర నొప్పితో విలవిలలాడింది. డాక్టర్లు చేతులెత్తేయడంతో పరిస్థితి విషమించింది. ఇలాంటి ఘటన గతంలో కేరళలోనూ జరగగా, అక్కడ వైద్యుడు తక్షణమే స్పందించి యువకుడి దవడను సరిచేశాడు. దవడ డిస్ లొకేషన్ కు సత్వర చికిత్స ఆవశ్యకతను ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయి.
ఇష్టమైన పానీపూరి తింటుండగా దవడ ఎముక పక్కకు జరిగి మహిళ నరక యాతన అనుభవించింది. దీని వల్ల నోరు మూయలేకపోయింది. మాట్లాడటం సాధ్యం కాలేదు. తెరుచుకున్న నోరు మళ్లీ మూత పడకపోవడంతో నొప్పితో విలవిల లాడింది. ఉత్తరప్రదేశ్ లో పానీ పూరి మెడికల్ ఎమర్జెన్సీకి కారణమైంది. ఔరయా జిల్లాలో ఒక మహిళ ఓ పానీపూరిని నోట్లో పెట్టుకుంటుండగా దవడ ఎముక పక్కకు జరిగింది. ఆ వీడియో వైరల్ గా మారింది. ఇంకిలా దేవి అనే మహిళ తన కుటుంబ సభ్యులతో క్లినిక్ కు వెళ్తున్న క్రమంలో.. ఆకలిగా ఉందని పానీ పూరి తిందామని బండి దగ్గర ఆగింది. ఆమెతో పాటు వచ్చిన మహిళ ఎలాంటి ఇబ్బంది లేకుండా గోల్ గప్పాలు తినేసింది. కానీ ఇంకిలా మాత్రం తినడంలో ఇబ్బంది పడింది. పెద్ద పానీ పూరిని నోట్లో పెట్టుకునే క్రమంలో నోటి దవడ ఎముక పక్కకు జరిగింది. దీంతో తెరిచిన నోరు తెరిచినట్లే ఉండిపోయింది. నొప్పి భరించలేక ఆమె విలవిలలాడింది. నొప్పితో తల్లడిల్లుతున్న మహిళను వెంటనే పక్కనే ఉన్న క్లినిక్ కు తీసుకెళ్లింది ఆమెతో వచ్చిన మరో మహిళ. డాక్టర్ కాసేపు ట్రీట్ మెంట్ చేయాలని ప్రయత్నించి.. కేసు క్రిటికల్ గా ఉందని చేతులెత్తేశాడు. మరింత అడ్వాన్స్ డ్ కేర్ అవసరం అని చెప్పడంతో అందరూ షాకయ్యారు. ఇటీవల కేరళలోని పాలక్కాడ్ స్టేషన్‌లో ప్రయాణికుడి దవడ జారింది. నొప్పితో బాధపడుతున్న యువకుడిని తోటి ప్రయాణికులు చూసి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. పాలక్కాడ్ రైల్వే ఆస్పత్రి డివిజనల్ మెడికల్ ఆఫీసర్ జితిన్ కు సమాచారం ఇచ్చారు. రైలు పాలక్కాడ్ స్టేషన్‌కు రాగానే ఆ ప్రయాణికుడిని పరీక్షించారు. క్షణాల్లోనే అతడి దవడను సరిచేశారు. దీనితో ఆ వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపి తన ప్రయాణాన్ని కొనసాగించాడు ఆ యువకుడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైద్యుడు తక్షణమే స్పందించాడని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏలియన్స్‌కు టెంపుల్ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు
ఆ గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరీ..కారణం తెలిస్తే షాకే !
జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో
ఏలియన్స్‌కు టెంపుల్ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు
ఆ గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరీ..కారణం తెలిస్తే షాకే !
డైనోసార్ల కాలం నాటి చేపను చూసారా !! ఇంకా బ్రతికే ఉంది
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో

