భోజనం తర్వాత వాకింగ్ చేస్తున్నారా..! ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
భోజనం చేశాక వెంటనే విశ్రాంతి తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, తిన్న తర్వాత కనీసం 15 నిమిషాలు నడవడం ఎంతో అవసరం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా, ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్రను అందిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ నడక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కోసం ఈ చిన్న అలవాటును పాటించండి.
వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. అయితే భోజనం చేసిన వెంటనే చాలామందికి నడుం వాల్చడం అలవాటు. అయితే అది ఏమాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. తిన్న తర్వాత కనీసం 15 నిమిషాలు వాకింగ్ చేయాలంటున్నారు. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచిస్తున్నారు. నిపుణుల ప్రకారం.. భోజనం తర్వాత 15 నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చక్కర స్థాయిలను సక్రమంగా ఉంచడంలో సహాయపడుతుంది. షుగర్ తో బాధపడేవారు ఇన్సులిన్ నిరోధకతతో బాధపడే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భోజనం తర్వాత ఈ కొద్దిసమయం నడక జీర్ణ క్రియను మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కడుపులో ఆహారం సక్రమంగా కదలడానికి ఇది సహాయపడుతుంది. భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల సంకోచాలు సులభంగా తగ్గిపోతాయి. దీంతో జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. ఉబ్బరాన్ని, కడుపు అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. నడక వల్ల రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాత్రి భోజనం తర్వాత నడక రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ధమనులు మూసుకోపోకుండా ఉండటానికి సహాయం చేస్తుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు, నడక ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. సున్నితమైన నడక రాత్రి నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల అదనపు క్యాలరీలు కరగడానికి తోడ్పడుతుంది. ఇది శరీరంలో కొవ్వు నిలువలను తగ్గిస్తుంది. తద్వారా సులభంగా బరువు తగ్గుతారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాత్రి గోళ్లు కట్ చేయకూడదు.. చాదస్తం కాదు ..సైంటిఫిక్ రీజన్ ఉంది
ఈ స్వామికి పానకం అంటే ఎంతిష్టమో.. నెలకు 50 వేల లీటర్ల
24 గంటలకు కాదు.. అక్కడ 64 రోజులకు సూర్యోదయం
ఈ స్వామికి పానకం అంటే ఎంతిష్టమో.. నెలకు 50 వేల లీటర్ల
24 గంటలకు కాదు.. అక్కడ 64 రోజులకు సూర్యోదయం
జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో
ఏలియన్స్‌కు టెంపుల్ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు
ఆ గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరీ..కారణం తెలిస్తే షాకే !
డైనోసార్ల కాలం నాటి చేపను చూసారా !! ఇంకా బ్రతికే ఉంది
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు

