పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
శ్రీకాకుళం, 'పేదల ఊటీ'గా ప్రసిద్ధి. నాగావళి నది, పచ్చని పొలాలు, సముద్రతీరం దీని ప్రత్యేకతలు. ఇటీవలి దిత్వా తుఫాను ప్రభావంతో, సూర్యుడు కనిపించకుండా దట్టమైన పొగమంచు, శీతల వాతావరణం ఊటీని తలపించింది. సాధారణంగా వేసవిలో సముద్రపు గాలి చల్లదనాన్ని ఇస్తుంది, కానీ ప్రస్తుతం శీతాకాలంలో ఈ ఆహ్లాదకర వాతావరణం స్థానికులను ఆకట్టుకుంది.
తమిళనాడు పశ్చిమ కనుమలలోని ఊటీకి.. ప్రపంచవ్యాప్తంగా ఓ అరుదైన వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు ఉంది. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో అందమైన కాఫీ తోటలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండే ఊటీలోని ప్రకృతి ఎవరినైనా మాయలో పడేస్తుందంటే అతిశయోక్తి కాదు. ఏటా వేసవిలో నిత్యం వేలాదిమంది టూరిస్ట్ లు ఊటీలో పర్యటిస్తూ ఉంటారు. అంతేకాదు..ఏదైనా ఒక ప్రాంతంలో వాతావరణం చల్లగా ఉంటే.. ‘వావ్.. ఊటీలో ఉన్నట్లుంది’ అని కూడా పోల్చటం మనకు తెలిసిందే. ఏపీలోని శ్రీకాకుళం పట్టణానికీ పేదల ఊటీ అనే గుర్తింపు ఉంది. శ్రీకాకుళం పట్టణం.. సముద్ర తీరానికి సమీపంలోనే ఉంటుంది. పట్టణానికి మణిహారంలా.. నాగావళి నది ప్రవహిస్తూ ఉంటుంది. శ్రీకాకుళం చుట్టూ ఉండే పచ్చని పొలాలు,పల్లె వాతావరణం శ్రీకాకుళంకి వచ్చే వారిని ఆకట్టుకుంటుంది. అంతేకాదు వేసవిలో సాయంత్రమైతే చాలు.. సమీపంలోని సముద్రపు గాలికి వాతావరణం చల్లబడుతుంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే వాతావరణం ఇక్కడ కాస్త చల్లగా ఉంటుంది. ఇకపోతే..ఈ ప్రాంతంలో పేదరికమూ ఎక్కువే. దశాబ్దాలుగా ఈ ప్రాంతవాసులు వలస జీవులుగా గుర్తింపు పొందారు. ఇక దిత్వా తుఫాను ప్రభావంతో.. గత మూడు రోజులుగా శ్రీకాకుళం ఊటీని తలపిస్తోంది. సోమవారం ఓ మోస్తరు వర్షం పడి ముసురు వాతావరణం అలుముకోగా…గత రెండు రోజులుగా మాత్రం ఎక్కడ చుక్క చినుకు పడలేదు. అయితే.. గత రెండు రోజులుగా సూర్యుడి జాడ లేకపోవటం, ఉదయం 6గంటల నుంచి పొద్దుపోయే వరకు రోజంతా ఒకేలాంటి వాతావరణం కొనసాగింది. అసలే శీతాకాలం కావడం సూర్యుడు జాడ ఎక్కడ కనిపించకపోవడంతో ఆహ్లాదకరమైన వాతావరణం అందరినీ ఆకట్టుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల సమయంలో కూడా పొగమంచు అలుముకున్నట్టు వాతావరణం ఊటీ ని తలపించేలా ఉంది. దీంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సిక్కోలు వాసులు ఎంజయ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..
పదిహేనేళ్ల నిరీక్షణ ఫలితం.. రూ.61 కోట్లు
Akhanda 2: అఖండ 2 ముందున్న అతిపెద్ద సవాల్ అదే
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..
పదిహేనేళ్ల నిరీక్షణ ఫలితం.. రూ.61 కోట్లు
11 ఏళ్ల చిన్నారి చిరుతతో పోరాటం.. అదే అతనికి రక్షణ కవచమైంది
ఈ స్వామికి పానకం అంటే ఎంతిష్టమో.. నెలకు 50 వేల లీటర్ల
24 గంటలకు కాదు.. అక్కడ 64 రోజులకు సూర్యోదయం
జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో

