గుడ్‌న్యూస్.. 2027 వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్‌లోకి రోహిత్, కోహ్లీ ఎంట్రీ.. గంభీర్, అగార్కర్‌లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారుగా?
Rohit Sharma - Virat Kohli: రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలవగా, విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా సిరీస్‌లో అదే అవార్డును గెలుచుకుని తమ సత్తా చాటారు. కానీ, 2027 ప్రపంచ కప్ ఇంకా చాలా దూరంలో ఉందని, అప్పుడే రోహిత్, కోహ్లీల భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వలేమని గంభీర్, అగార్కర్‌లు చెబుతూ వస్తున్నారు.

ODI World Cup 2027: టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ, 2027 వన్డే ప్రపంచ కప్ కోసం వీరిద్దరూ జట్టు ప్రణాళికలో ఉన్నారా లేదా అనే విషయంలో బీసీసీఐ (BCCI) ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
అసలు విషయం ఏంటంటే..
రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలవగా, విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా సిరీస్‌లో అదే అవార్డును గెలుచుకుని తమ సత్తా చాటారు. కానీ, 2027 ప్రపంచ కప్ ఇంకా చాలా దూరంలో ఉందని, అప్పుడే రోహిత్, కోహ్లీల భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వలేమని గంభీర్, అగార్కర్‌లు చెబుతూ వస్తున్నారు. దీనిపై దేవాంగ్ గాంధీ స్పందిస్తూ, ఈ సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టే ఆలోచన చేయవద్దని హెచ్చరించారు.
దేవాంగ్ గాంధీ ఏమన్నారంటే..
“రోహిత్, కోహ్లీ జట్టులో ఉన్నంత కాలం, ప్రణాళికలు వారి చుట్టూనే తిరగాలి. మేనేజ్మెంట్ ఇప్పటి నుంచే కేవలం 20 మంది ఆటగాళ్ల పూల్‌ను సిద్ధం చేసుకోవాలి. 2019 ప్రపంచ కప్‌నకు ముందు నంబర్ 4 స్థానంలో ఎవరినీ సెటిల్ చేయకపోవడం వల్ల సెమీఫైనల్స్‌లో ఇబ్బంది పడ్డాం. అలాగే 2023 ప్రపంచ కప్‌లో కూడా వన్డే రికార్డు సరిగా లేని సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించాల్సి వచ్చింది. ఇలాంటి తప్పులు మళ్లీ జరగకూడదు” అని గాంధీ టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.
రిషబ్ పంత్‌కు అవకాశాలు ఇవ్వాలి..
గాయాల బెడదను దృష్టిలో ఉంచుకుని రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని గాంధీ సూచించారు. “ఒకవేళ ప్రపంచ కప్ సమయంలో కేఎల్ రాహుల్ గాయపడితే, పంత్ లేదా మరో వికెట్ కీపర్ సిద్ధంగా ఉండాలి. 2019లో పంత్ కేవలం 5 వన్డేల అనుభవంతోనే జట్టులోకి వచ్చాడు. అలాంటి పరిస్థితి రాకూడదు” అని ఆయన అభిప్రాయపడ్డారు.
మొత్తానికి, సీనియర్ల ఫామ్‌ను, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 2027 ప్రపంచ కప్ కోసం ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని మాజీ సెలెక్టర్ సూచించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




