కేక్ ఆఫర్ చేసిన జైస్వాల్.. ‘సారీ’ అంటూ రిజెక్ట్ చేసిన హిట్ మ్యాన్
విశాఖ వన్డేలో సౌతాఫ్రికాపై టీమిండియా సిరీస్ విజయం సాధించింది. అనంతరం జరిగిన సంబరాల్లో, యశస్వి కేక్ ఇవ్వబోగా ఫిట్‌నెస్ కారణంగా రోహిత్ శర్మ నిరాకరించడం వైరల్ అయ్యింది. బరువు తగ్గి సన్నగా మారిన రోహిత్, కోహ్లీలు హాఫ్ సెంచరీలతో ఫామ్‌లోకి రావడం అభిమానులను అలరించింది. జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో వీరి ఆట చూడవచ్చు.
విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం హోటల్‌కు చేరుకున్నాక ప్లేయర్లు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ కేక్ కట్‌చేసి విరాట్ కోహ్లీకి చిన్న ముక్క తినిపించాడు. అక్కడే ఉన్న రోహిత్ శర్మకు కేక్ తినిపించేందుకు యశస్వి ప్రయత్నించగా ‘మళ్లీ లావైపోతాను.. నాకొద్దు’ అంటూ ముందుకు కదిలాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా సరదాగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్.. ఇటీవల కాలంలో ఫిట్‌నెస్ దృష్టిపెట్టాడు. కఠినమైన డైట్ ఫాలో అవుతూ ఏకంగా 10 కిలోల బరువు తగ్గి సన్నగా మారాడు. విశాఖ వన్డేలో రోహిత్, కోహ్లీల ఆటతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇద్దరు హాఫ్ సెంచరీలతో ఫామ్‌లోకి రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మళ్లీ రోహిత్, కోహ్లీలను ఫ్యాన్స్ మళ్లీ జనవరిలో మైదానంలో చూడనున్నారు. జనవరి 11 నుంచి టీమ్ఇండియా, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్, కోహ్లీ ఆడనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
మెట్రో రైలు .. ట్రాక్‌పై నడిచిన ప్రయాణికులు
డిగ్రీ కన్నా నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం..
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..

