ఔను.. మా పెళ్లి రద్దయింది.. ఇక నా దృష్టి కేవలం దానిపైనే
స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ల వివాహం రద్దయింది. ఈ విషయాన్ని స్మృతి స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. తన వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వాలని కోరుతూ, ఇకపై తన దృష్టి పూర్తిగా క్రికెట్‌పైనే ఉంటుందని తెలిపారు. పలాష్ ముచ్చల్ కూడా తమ బంధానికి స్వస్తి పలికినట్లు, తనపై వస్తున్న మోసం ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు.
భారత మహిళా క్రికెట్ జట్టులో స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దయింది. ఈ విషయాన్ని స్మృతి మంధాన స్వయంగా తన ఇన్ స్టా ద్వారా వెల్లడించింది. అంతేకాదు, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలంటూ అభిమానులు, మీడియాకు విజ్ఞప్తి చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ తో కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న స్మృతి మంధాన ఇటీవల పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్దమైంది. డిసెంబరు 23న వివాహానికి ముంబైలో ఏర్పాట్లు కూడా జరిగాయి. సంగీత్, మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఏం జరిగిందో ఏమో…చివరి నిమిషంలో వివాహం ఆగిపోయింది. స్మృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు ఆమె మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, శ్రీనివాస్ మంధాన కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత కూడా వివాహానికి సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో స్మృతి, పలాశ్ ల వివాహం రద్దయినట్లేనని ప్రచారం జరిగింది. ఎంగేజ్‌మెంట్ ప్రపోజల్, హల్దీ, మోహందీ వేడుకలకు సంబంధించిన వీడియోలు స్మృతి తన సోషల్ మీడియా ఖాతాల్లోంచి తొలగించడంతో ఈ ప్రచారానికి మరింత బలాన్నిచ్చింది. మరోవైపు ఈ వార్తలపై ఇటు స్మృతి కానీ అటు పలాశ్ కానీ స్పందించలేదు. పలాశ్ కుటుంబం మాత్రం వివాహం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో స్మృతి మంధాన స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘నా వ్యక్తిగత జీవితాన్ని బయటి ప్రపంచానికి చూపించడానికి నేను ఇష్టపడను. కానీ, కొన్నిరోజులుగా నా జీవితంపై వదంతులు వస్తున్న క్రమంలో స్పందించాల్సి వస్తోంది. పలాశ్ తో నా వివాహం రద్దు అయింది. ఈ విషయాన్ని నేను ఇంతటితో వదిలేస్తున్నా. మీరూ వదిలేయండి. ఇరు కుటుంబాల ప్రైవసీని అందరూ గౌరవించాలని రిక్వెస్ట్ చేస్తున్నా అంటూ పోస్ట్ పెట్టారు. ఇక తన దృష్టంతా క్రికెట్ పైనే ఉంటుందని, జాతీయ జట్టుకు శక్తిమేర సేవలు అందిస్తానని పోస్టులో రాసుకొచ్చారు స్మృతి మంథాన. ఇక తమ పెళ్లి రద్దుపై ఇటు సంగీత దర్శకుడు, ఫిల్మ్ మేకర్ పలాశ్ ముచ్ఛల్ కూడా స్పందించారు. ఈ వ్యక్తిగత సంబంధం నుంచి బయటికి వచ్చానని, ఇక తాను ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తనపై వస్తున్న మోసం ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు పలాశ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ప్రకటన విడుదల చేశారు. తనపై ఇటీవల వస్తున్న మోసం ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవి అవాస్తవాలని కొట్టిపారేశారు. ఈ సందర్భంగా ఆయన “నాపై వస్తున్న వదంతులను నిజమని నమ్మేవారిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. కేవలం ఊహాగానాల ఆధారంగా ఒకరిపై నిర్ణయానికి రావడం సరికాదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారికి పలాశ్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. “నా గురించి, నా కుటుంబం గురించి నిరాధారమైన అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను” అని ఆయన స్పష్టం చేశారు. స్మృతి మంధాన తమ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన వెంటనే పలాశ్ ఈ వివరణ ఇవ్వడం గమనార్హం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సర్పంచ్ కుర్చీ కోసం సతి Vs పతి
ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా !!
ఇక దానికి ఆధార్ కార్డు చెల్లదు.. భారీ మార్పులు.. బిగ్ అలర్ట్..
తత్కాల్ కౌంటర్ బుకింగ్స్‌లో కీలక మార్పు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
సర్పంచ్ కుర్చీ కోసం సతి Vs పతి
ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా !!
చాట్ జీపీటీ తో స్కామర్ కి.. చుక్కలు చూపిన ఢిల్లీ యువకుడు
కాలేజ్‌లో యువతుల సిగపట్లు.. ఇంతకీ గొడవ ఏంటంటే
అద్భుతం.. ఒకే మొక్కకు 100 బ్రహ్మకమలాలు
పాపం.. ప్రాణం తీసిన ఖర్జూరం గింజ.. పెనుకొండ విషాదం

