సర్పంచ్ కుర్చీ కోసం సతి Vs పతి
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సర్పంచ్ పదవి కోసం అన్నదమ్ములు, తల్లి కూతుళ్లు, భార్యాభర్తలు కూడా పోటీ పడుతున్నారు. యాదాద్రి జిల్లాలో మహేష్, అతని భార్య శ్రీలత సర్పంచ్ పీఠం కోసం బరిలో దిగారు. జ్యోతిష్యుడి సలహాతో భార్యను నామినేట్ చేసిన మహేష్, ఓటర్లను గందరగోళంలో పడేశాడు. ఇవి స్థానిక ఎన్నికలలో వింత ఘటనలకు నిదర్శనం.
తెలంగాణలో పంచాయతీ సంగ్రామం రసవత్తరంగా మారింది. అన్నపై తమ్ముడు.. తమ్ముడిపై అన్న.. తల్లిపై కూతరు.. కూతురిపై తల్లి ఇలా సర్పంచ్ పీఠం దక్కించుకునేందుకు ఒకే ఇంటివారు పోటీ పడుతుండటం పలు చోట్ల ఆసక్తికరంగా మారింది. యాదాద్రి జిల్లాలోనైతే భార్య భర్తలే ప్రత్యర్థులుగా మారి బరిలో నిలుచున్నారు. గెలుపు నీదా నాదా సై అంటున్నారు. యాదాద్రి జిల్లా బీబీనగర్‌కు చెందిన నారగోని మహేష్ గ్రామంలో చురుకుగా ఉండేవాడు. తాను ఏ పనికైనా, కార్యాలకైనా గురువుగా భావించే ఓ జ్యోతిష్యుడిని సంప్రదిస్తుంటాడు. దాంతోపాటు అతడికి భార్య అంటే సెంటిమెంట్. అయితే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలని మహేష్ భావించాడు. తన గురువైన సిద్ధాంతి వద్ద తన కోరికను వెలిబుచ్చాడు. నువ్వు తలపెట్టిన కార్యంలో ఎప్పటిలాగే నీ భార్య కూడా ఉండాలని.. అప్పుడే విజయం వరిస్తుందని జ్యోతిష్యుడు చెప్పాడట. వెంటనే గ్రామ సర్పంచ్ పదవికి తనతో పాటు భార్య శ్రీలతతో కూడా నామినేషన్ వేయించాడు. ఎనిమది వేల ఓట్లు కలిగిన బీబీనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కాంగ్రెస్, బిఆర్ఎస్ మద్దతు దారులతోపాటు భార్యాభర్తలు బరిలో ఉన్నారు. మహేష్‌కు ఉంగరం, శ్రీలతకు కత్తెర గుర్తులు వచ్చాయి. సర్పంచ్ ఎన్నిక బ్యాలెట్‌లో భార్యాభర్తల గుర్తులు కనిపించడంతో బీబీనగర్ వాసులు ఆసక్తిగా చూస్తున్నారు. తనకు భార్య సెంటిమెంట్ అని.. ఆమెతో కలిసి చేసే ప్రతి పని కలిసి వస్తుందని మహేష్ చెబుతున్నాడు. జ్యోతిష్యుడు సూచన మేరకే సర్పంచ్ పదవికి తనతో పాటు భార్యను కూడా బరిలో దింపానని మహేష్ చెబుతున్నాడు. దీంతో అసలు ఓటు వేయాలనుకున్నాళ్లు భర్తకు వేయాలా..? భార్యకు వేయాలా అనే కన్‌ఫ్యూజన్ మొదలైంది. అయితే మహేష్‌కు భార్య సెంటిమెంటు ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. ఇలా ఈ తెలంగాణ స్థానిక ఎన్నికల్లో ఎన్నో చిత్ర విచత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా !!
ఇక దానికి ఆధార్ కార్డు చెల్లదు.. భారీ మార్పులు.. బిగ్ అలర్ట్..
తత్కాల్ కౌంటర్ బుకింగ్స్‌లో కీలక మార్పు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఉద్యోగులకు షాక్.. ఇకపై ఎలాంటి పొడిగింపులు ఉండవు !! బాంబు పేల్చిన EPFO
సర్పంచ్ కుర్చీ కోసం సతి Vs పతి
ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా !!
చాట్ జీపీటీ తో స్కామర్ కి.. చుక్కలు చూపిన ఢిల్లీ యువకుడు
కాలేజ్‌లో యువతుల సిగపట్లు.. ఇంతకీ గొడవ ఏంటంటే
అద్భుతం.. ఒకే మొక్కకు 100 బ్రహ్మకమలాలు
పాపం.. ప్రాణం తీసిన ఖర్జూరం గింజ.. పెనుకొండ విషాదం

