తత్కాల్ కౌంటర్ బుకింగ్స్‌లో కీలక మార్పు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
రైల్వే శాఖ తత్కాల్ టిక్కెట్ల బుకింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు కీలక మార్పు చేపట్టింది. ఇకపై రైల్వే కౌంటర్ల వద్ద తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి. ఆన్‌లైన్‌లో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ విధానం ఇప్పుడు కౌంటర్లకు విస్తరిస్తోంది. ప్రయోగాత్మకంగా ప్రారంభమై, త్వరలో అన్ని రిజర్వేషన్ కార్యాలయాలకు విస్తరించనుంది. ఇది అసలైన ప్రయాణికులకు మేలు చేస్తుంది.
తత్కాల్ టిక్కెట్లకు సంబంధించి రైల్వే శాఖ మరో కీలక మార్పునకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకూ ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్ చేసుకునే తత్కాల్ టికెట్లకు ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. తాజాగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తీసుకునే తత్కాల్ టిక్కెట్లకు కూడా వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను తప్పనిసరి చేయనుంది. తత్కాల్ టిక్కెట్ బుకింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు ఈ నిబంధనను అమలు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. రిజర్వేషన్ కౌంటర్ల వద్ద నవంబర్ 17 నుంచి ఓటీపీ ఆధారిత తత్కాల్ టిక్కెట్ బుకింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. తొలుత కొన్ని రైళ్లతో మొదలు పెట్టి తర్వాత 52 రైళ్లకు విస్తరించింది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ విధానాన్ని అన్ని రిజర్వేషన్ కార్యాలయాలకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంటే ఇకపై కౌంటర్ వద్ద రిజర్వేషన్ ఫారమ్ నింపిన తర్వాత బుకింగ్ సమయంలో మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే టిక్కెట్ బుక్ అవుతుంది. రైల్వే టికెట్ల విషయంలో ఇటీవల రైల్వేమంత్రిత్వ శాఖ పలు మార్పులు చేపట్టింది. అక్రమాలకు తావులేకుండా అసలైన ప్రయాణికులకు మేలు చేకూర్చేందుకు ఈ మార్పులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా జులై నుంచి ఆన్‌లైన్ తత్కాల్ టికెట్ బుకింగ్‌కు ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. అక్టోబర్ నుంచి సాధారణ రిజర్వేషన్ టికెట్లకు సైతం తొలి 15 నిమిషాల బుకింగ్‌కు ఆధార్ అథంటికేషన్ ఉన్న యూజర్లకు మాత్రమే అవకాశం కల్పిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉద్యోగులకు షాక్.. ఇకపై ఎలాంటి పొడిగింపులు ఉండవు !! బాంబు పేల్చిన EPFO
లోన్ తీసుకున్న వారికి భారీ ఉపశమనం.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ
చాట్ జీపీటీ తో స్కామర్ కి.. చుక్కలు చూపిన ఢిల్లీ యువకుడు
చాట్ జీపీటీ తో స్కామర్ కి.. చుక్కలు చూపిన ఢిల్లీ యువకుడు
కాలేజ్‌లో యువతుల సిగపట్లు.. ఇంతకీ గొడవ ఏంటంటే
అద్భుతం.. ఒకే మొక్కకు 100 బ్రహ్మకమలాలు
పాపం.. ప్రాణం తీసిన ఖర్జూరం గింజ.. పెనుకొండ విషాదం
హెలికాఫ్టర్‌లో పుట్టింటికి వెళ్లి.. శుభలేఖలు పంచిన మహిళ
ఇండిగో ఎఫెక్ట్.. కొత్త జంటల తీవ్ర ఇబ్బందులు..
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్డీ చేస్తా... సర్పంచ్ అభ్యర్థి హామీ

