Brahma Kamalam: అద్భుతం.. ఒకే మొక్కకు 100 బ్రహ్మకమలాలు
బ్రహ్మ కమలం, హిమాలయాల్లో మాత్రమే లభించే అరుదైన, పవిత్రమైన పుష్పం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ఆయుర్వేద ఔషధ గుణాలు దీని సొంతం. సాధారణంగా కొన్ని పూలు మాత్రమే పూసే ఈ మొక్కకు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకేసారి 100 పూలు పూసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ప్రత్యేక సంఘటన బ్రహ్మ కమలం విశిష్టతను చాటిచెబుతోంది.
బ్రహ్మ కమలం.. హిమాలయాల్లో మాత్రమే కనిపించే ఒక అరుదైన, పవిత్రమైన పుష్పం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు, ఆయుర్వేదం ఔషధ గుణాలు దీని సొంతం. ఈ పువ్వు రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది. ఈ బ్రహ్మ కమలం మొక్కలను ఇటీవల చాలామంది తమ ఇళ్లలో పెంచుతున్నారు. ఈ మొక్క పుష్పించినప్పుడు తమ ఇంటికి అదృష్టం, సంపద , శాంతిని తెస్తుందని నమ్ముతారు. ఇది హిందూ మతంలో దేవతారాధనకు ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఇక ఆయుర్వేద వైద్యం పరంగా ఇది ఒత్తిడి తగ్గించడం, మూత్ర సంబంధిత సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఈ అరుదైన బ్రహ్మకమలం మొక్కకు సాధారణంగా రెండు మూడు పూలు పూస్తాయి. అరుదైన సందర్భాల్లో 10 నుంచి 12 పూలు కూడా పూస్తాయి. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకే మొక్కకు ఒకేసారి ఏకంగా 100 పూలు పూసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితులు పెద్దింటి రామం గారి ఇంటి పెరట్లో విశేషమైన ఆధ్యాత్మిక సంఘటన చోటుచేసుకుంది. ఒకే బ్రహ్మకమలం మొక్కకు ఒకేసారి 100 పువ్వులు పూయడంతో స్థానికంగా ఆనందకర వాతావరణం నెలకొంది. ఈ మొక్కను 4 సంవత్సరాల క్రితం పూణే నుండి ప్రత్యేకంగా తెప్పించుకున్నారని, ఈ నాలుగేళ్లలో ఈ మొక్కకు ఇప్పటివరకు 5000కి పైగా పువ్వులు పూసాయని ఆయన చెప్పారు. సాధారణంగా బ్రహ్మకమలం మొక్క చాలా అరుదుగా పూస్తుంది. సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే పువ్వు విరుస్తుంది. అలాంటి మొక్క ఈ స్థాయిలో పువ్వులు పూయడంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఈ బ్రహ్మ కమలం పుష్పాన్ని పార్వతీ పుష్పం, రాత్రి రాణి, హిమాలయ బ్రహ్మ కువ్వ అని కూడా పిలుస్తారు. బ్రహ్మకమలం – ఆధ్యాత్మికత, శుభఫలితాలకు ప్రతీక బ్రహ్మకమలం హిమాలయాలలో కనిపించే అత్యంత పవిత్రమైన, అరుదైన పుష్పం. దీనిని “పార్వతీ పుష్పం ,రాత్రిరాణి, హిమాలయ బ్రహ్మ కువ్వ” అని కూడా పిలుస్తారు. హిందూ ధర్మంలో ఈ పుష్పానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది రాత్రి వేళ 2 నుంచి మూడు గంటల సమయంలో పూస్తుంది. ఈ పువ్వు పూసిన ఇంట్లో మహాలక్ష్మి కటాక్షం లభించినట్టుగా భావిస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాపం.. ప్రాణం తీసిన ఖర్జూరం గింజ.. పెనుకొండ విషాదం
TOP 9 ET News: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన NTRఎందుకంటే
ఇండిగో ఎఫెక్ట్.. విమాన టికెట్ ధరలకు కేంద్రం కళ్లెం
హెలికాఫ్టర్‌లో పుట్టింటికి వెళ్లి.. శుభలేఖలు పంచిన మహిళ.. ఆశ్చర్యపోతున్న నెటిజెన్స్
ఇండిగో ఎఫెక్ట్.. కొత్త జంటల తీవ్ర ఇబ్బందులు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
అద్భుతం.. ఒకే మొక్కకు 100 బ్రహ్మకమలాలు
పాపం.. ప్రాణం తీసిన ఖర్జూరం గింజ.. పెనుకొండ విషాదం
హెలికాఫ్టర్‌లో పుట్టింటికి వెళ్లి.. శుభలేఖలు పంచిన మహిళ
ఇండిగో ఎఫెక్ట్.. కొత్త జంటల తీవ్ర ఇబ్బందులు..
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్డీ చేస్తా... సర్పంచ్ అభ్యర్థి హామీ
ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా
రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు

