AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెలికాఫ్టర్‌లో పుట్టింటికి వెళ్లి.. శుభలేఖలు పంచిన మహిళ.. ఆశ్చర్యపోతున్న నెటిజెన్స్

హెలికాఫ్టర్‌లో పుట్టింటికి వెళ్లి.. శుభలేఖలు పంచిన మహిళ.. ఆశ్చర్యపోతున్న నెటిజెన్స్

Phani CH
|

Updated on: Dec 09, 2025 | 11:10 AM

Share

ఆన్‌లైన్ ఆహ్వానాల కాలంలో హర్యానాలో ఓ తల్లి తన కొడుకు పెళ్లికి వినూత్నంగా ఆహ్వానం పలికింది. పింకీ అనే మహిళ తన పుట్టింటి వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా 25 కి.మీ. దూరంలో ఉన్న గ్రామానికి హెలికాప్టర్‌లో వెళ్లి శుభలేఖలు అందించింది. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా, 'భాత్' సంప్రదాయాన్ని గుర్తు చేసింది.

ప్రస్తుత కాలంలో అన్ని పనులూ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. పెళ్లి పిలుపులనుంచి వివాహాలు, రిసెప్షన్‌లు వరకూ అన్నీ ఆన్‌లైన్‌లోనే. పూర్వం పెళ్ళంటే నెల రోజులముందునుంచే పిలుపులు మొదలు పెట్టేవారు. స్వయంగా బంధువుల ఇళ్లకు వెళ్లి శుభలేఖ ఇచ్చి బొట్టుపెట్టి వివాహానికి ఆహ్వానించేవారు. ఇప్పుడు వాట్సప్‌లో ఒక్క మెసేజ్‌తో సరిపెట్టేస్తున్నారు. అలాంటిది ఓ మహిళ తన కుమారుడి వివాహానికి తన పుట్టింటివారిని ఆహ్వానించడానికి ఏకంగా హెలికాఫ్టర్‌లో వెళ్లింది. అదేదో పక్క రాష్ట్రమో, దేశమో అనుకునేరు. కానే కాదు.. జస్ట్‌ 25 కి.మీ. అంతే. ఈ ఘటన హర్యాణాలో జరిగింది. హర్యాణాలోని గురుగ్రామ్‌కు చెందిన పింకీ అనే మహిళ తన పుట్టింటివారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తన కుమారుడి వివాహానికి ఆహ్వానించాలనుకుంది. తన ఊరికి 25 కి.మీ. దూరంలో ఉన్న పుట్టింటికి హెలికాఫ్టర్‌లో వెళ్లి తన అన్నదమ్ములను ఆహ్వానించింది. తన కుమారుడు రోహిత్‌ దహియా వివాహ ఆహ్వానం అతని మేనమామలకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్న పింకీ హెలికాఫ్టర్‌ను అద్దెకు తీసుకొని భౌదా ఖుర్ద్‌ గ్రామంలోని తన పుట్టింటి ముందే శుభలేఖలతో ల్యాండ్‌ అయ్యారు. ఇంటిముందు ఆగిన హెలికాఫ్టర్‌ను చూసి ఆశ్చర్యపోయిన ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆమెను సాదరంగా పూల బొకేలతో ఆహ్వానించారు. హెలికాఫ్టర్‌ను చూసేందుకు ఆ గ్రామస్తులంతా అక్కడ చేరారు. దీంతో అక్కడ వాతావరణం సందడిగా మారింది. డిసెంబరు 11న తన కుమారుడి వివాహానికి రావాలని తన పెట్టింటివారిని ఆహ్వానించింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే భాత్‌ పేరుతో తన కుమారుడి పెళ్లికి ముందు ఒక సోదరి తన సోదరుడిని ఆహ్వానించడానికి వెళ్లడం అక్కడ సంప్రదాయం. ఆ తర్వాత సోదరుడు సోదరి ఇంటికి వెళ్లి వాళ్లకు ‘భాత్​’ రూపంలో బహుమతి ఇస్తాడు. ఈ నేపథ్యంలో పింకీ తన సోదరుడి ఇంటికి హెలికాప్టర్​లో వెళ్లింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇండిగో ఎఫెక్ట్‌.. కొత్త జంటల తీవ్ర ఇబ్బందులు.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో