పాపం.. ప్రాణం తీసిన ఖర్జూరం గింజ.. పెనుకొండ విషాదం
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఖర్జూరం గింజ గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గంగాధర్ అనే వ్యక్తి పండ్లు తింటుండగా ఈ ప్రమాదం జరిగింది. గింజ శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది, అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేసింది.
ఓ చిన్న అజాగ్రత్త నిండు ప్రాణాన్ని బలిగొంది. ఖర్జూరం తింటుండగా దాని గింజ గొంతులో ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి ఊపిరాడక మృతిచెందాడు. ఈ విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో చోటుచేసుకుంది. పెనుకొండకు చెందిన గంగాధర్ కార్లను అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు గత కొంతకాలంగా గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో ఖర్జూర పండ్లు తింటుండగా, ప్రమాదవశాత్తు ఓ గింజ గొంతులో ఇరుక్కుంది. అది శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో గంగాధర్‌కు శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. కుటుంబసభ్యులు వెంటనే అతడిని పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కూడా అనంతపురంలోని పెద్ద ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో కుటుంబసభ్యులు అతడిని అనంతపురానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గంగాధర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన NTRఎందుకంటే
ఇండిగో ఎఫెక్ట్.. విమాన టికెట్ ధరలకు కేంద్రం కళ్లెం
హెలికాఫ్టర్‌లో పుట్టింటికి వెళ్లి.. శుభలేఖలు పంచిన మహిళ.. ఆశ్చర్యపోతున్న నెటిజెన్స్
ఇండిగో ఎఫెక్ట్.. కొత్త జంటల తీవ్ర ఇబ్బందులు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
పాపం.. ప్రాణం తీసిన ఖర్జూరం గింజ.. పెనుకొండ విషాదం
హెలికాఫ్టర్‌లో పుట్టింటికి వెళ్లి.. శుభలేఖలు పంచిన మహిళ
ఇండిగో ఎఫెక్ట్.. కొత్త జంటల తీవ్ర ఇబ్బందులు..
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్డీ చేస్తా... సర్పంచ్ అభ్యర్థి హామీ
ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా
రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు
ఈ కోతులు సల్లగుండా సర్పంచ్ ఎన్నికలనే మార్చేశాయిగా

