కాలేజ్‌లో యువతుల సిగపట్లు.. ఇంతకీ గొడవ ఏంటంటే
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఇద్దరు విద్యార్థినుల మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఒకరి జుట్లు ఒకరు పట్టుకుని కొట్టుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాలేజీ ప్రాంగణంలో జరిగిన ఈ తతంగంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వైరల్ వీడియో వెనుక అసలు కారణాలు తెలియరాలేదు.
ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఇద్దరు విద్యార్థినుల మధ్య ఉన్నట్లుండి గొడవ మొదలైంది. అది కాస్త తీవ్రరూపం దాల్చి ఒకరినొకరు జుట్లు పట్టుకుని కొట్టుకునే వరకూ చేరుకుంది. కాలేజీ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం.. ఎర్రటి చుడీదార్ వేసుకున్న ఓ అమ్మాయి.. తనకు కాస్త దూరంలో కూర్చుని ఉన్న మరో అమ్మాయితో ఏదో విషయమై కాసేపు మాట్లాడింది. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు.. ఉన్నట్లుండి దూరంగా నిలబడిన అమ్మాయి ఒక్కసారిగా ముందుకు వచ్చి తను అప్పటివరకు మాట్లాడిన అమ్మాయిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే ఆవేశంలో ఆ అమ్మాయి జుట్టుని గట్టిగా పట్టేసుకుంది. దాంతో ఆ అమ్మాయి కూడా తిరిగి ఎదురుదాడి చేసేందుకు ముందుకు దూకింది. అలా ఒకరి జుట్లు ఒకరు పట్టుకుని పెద్దగా తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో అక్కడే ఉన్న వారి స్నేహితులు ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. కానీ వారివల్లకాలేదు. దాంతో కాసేపు ఈ తతంగం అలాగే కొనసాగింది. అసలు ఆ ఇద్దరు ముందుగా ఏ విషయంపై మాట్లాడుకున్నారు.. ఆ తర్వాత కొట్టుకునే వరకు గొడవ ఎందుకు మొదలైంది అనేది క్లారిటీ లేదు కానీ.. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Brahma Kamalam: అద్భుతం.. ఒకే మొక్కకు 100 బ్రహ్మకమలాలు
పాపం.. ప్రాణం తీసిన ఖర్జూరం గింజ.. పెనుకొండ విషాదం
TOP 9 ET News: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన NTRఎందుకంటే
ఇండిగో ఎఫెక్ట్.. విమాన టికెట్ ధరలకు కేంద్రం కళ్లెం
హెలికాఫ్టర్‌లో పుట్టింటికి వెళ్లి.. శుభలేఖలు పంచిన మహిళ.. ఆశ్చర్యపోతున్న నెటిజెన్స్
కాలేజ్‌లో యువతుల సిగపట్లు.. ఇంతకీ గొడవ ఏంటంటే
అద్భుతం.. ఒకే మొక్కకు 100 బ్రహ్మకమలాలు
పాపం.. ప్రాణం తీసిన ఖర్జూరం గింజ.. పెనుకొండ విషాదం
హెలికాఫ్టర్‌లో పుట్టింటికి వెళ్లి.. శుభలేఖలు పంచిన మహిళ
ఇండిగో ఎఫెక్ట్.. కొత్త జంటల తీవ్ర ఇబ్బందులు..
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్డీ చేస్తా... సర్పంచ్ అభ్యర్థి హామీ
ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా

