చాట్ జీపీటీ తో స్కామర్ కి.. చుక్కలు చూపిన ఢిల్లీ యువకుడు
ఢిల్లీ యువకుడు చాట్ జీపీటీ సాయంతో సైబర్ మోసగాడికి బుద్ధి చెప్పాడు. ఆర్మీ అధికారిగా నమ్మించి ఫర్నీచర్ అమ్మజూపిన మోసగాడి ఐపీ అడ్రస్, లొకేషన్, మొబైల్ కెమెరా ఫోటోను రాబట్టాడు. తన వివరాలు బయటపడటంతో మోసగాడు క్షమాపణ కోరాడు. ఆన్‌లైన్ మోసాలను ఎదుర్కోవడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో ఈ ఘటన నిరూపించింది.
ఆర్మీ అధికారిగా నమ్మించి మోసం చేయాలని చూసిన సైబర్ మోసగాడికి ఢిల్లీ యువకుడు చుక్కలు చూపించాడు. చాట్ జీపీటీ సాయంతో వెబ్ సైట్ లింక్ పంపించి మోసగాడి ఐపీ అడ్రస్, మొబైల్ కెమెరా హ్యాక్ చేసి ఫొటో సంపాదించాడు. ఆ వివరాలు అతడికే పంపడంతో సైబర్ మోసగాడు కాళ్లబేరానికి వచ్చాడు. ఇకపై ఈ మోసాలకు స్వస్తి చెబుతానని, తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు. అసలేం జరిగిందంటే.. ఢిల్లీకి చెందిన ఓ యువకుడికి ఫేస్ బుక్ లో గుర్తుతెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. తన ఫ్రెండ్ సీఆర్పీఎఫ్ ఆఫీసర్ అని, సడెన్‌గా బదిలీ కావడంతో ఇంట్లోని ఫర్నీచర్ మొత్తాన్ని అయినకాడికి అమ్మేస్తున్నాడని ఆగంతకుడు చెప్పాడు. ఫర్నీచర్ ఫొటోలు పెట్టి అతి తక్కువ ధరకే ఇప్పిస్తానని తెలిపాడు. అయితే, ఆ ప్రొఫైల్ ఫొటో తన కాలేజీ సీనియర్, ఐఏఎస్ ఆఫీసర్ దని ఢిల్లీ వాసి గుర్తించాడు. వెంటనే తన సీనియర్ కు ఫోన్ చేసి వివరాలు కనుక్కోవడంతో తనకు వచ్చిన మెసేజ్ మోసమని తేలింది. ఇక ఆ చీటర్‌ని ఓ ఆట ఆడుకోవాలని భావించిన ఢిల్లీ యువకుడు.. ఫర్నీచర్ కొంటానని చెప్పాడు. దీంతో మోసగాడు ఓ క్యూఆర్ కోడ్ పంపి డబ్బులు చెల్లించాలని అడగగా.. ఆ కోడ్ స్కాన్ కావట్లేదని చెప్పి ఛాట్ జీపీటీ సాయంతో తయారుచేసిన ఫేక్ వెబ్ సైట్ లింక్ ను మోసగాడికి పంపించాడు. ఆ లింక్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ పోస్ట్ చేయాలని అడిగాడు. డబ్బులు వస్తున్నాయనే ఆనందంలో వెనకాముందు చూడకుండా మోసగాడు ఆ లింక్ క్లిక్ చేశాడు. ఆ వెంటనే మోసగాడి ఐపీ అడ్రస్, రాజస్థాన్ లోని అతడు ఉంటున్న ఇంటి చిరునామాతో పాటు మొబైల్ ఫ్రంట్ కెమెరా సాయంతో తీసిన స్పాట్ ఫొటో ఢిల్లీ వాసి రాబట్టాడు. ఆపై ఆ వివరాలను ఆ మోసగాడికే పంపించాడు. ఊహించని ఈ పరిణామంతో మోసగాడు కంగుతిన్నాడు. తనను వదిలేయాలని ప్రాధేయపడ్డాడు. అయితే, ఈ మోసగాడి వివరాలను, మోసం చేయాలనుకున్న పద్ధతికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాజస్థాన్ సైబర్ పోలీసులకు పంపించానని ఢిల్లీ వాసి చెప్పాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాలేజ్‌లో యువతుల సిగపట్లు.. ఇంతకీ గొడవ ఏంటంటే
Brahma Kamalam: అద్భుతం.. ఒకే మొక్కకు 100 బ్రహ్మకమలాలు
పాపం.. ప్రాణం తీసిన ఖర్జూరం గింజ.. పెనుకొండ విషాదం
చాట్ జీపీటీ తో స్కామర్ కి.. చుక్కలు చూపిన ఢిల్లీ యువకుడు
కాలేజ్‌లో యువతుల సిగపట్లు.. ఇంతకీ గొడవ ఏంటంటే
అద్భుతం.. ఒకే మొక్కకు 100 బ్రహ్మకమలాలు
పాపం.. ప్రాణం తీసిన ఖర్జూరం గింజ.. పెనుకొండ విషాదం
హెలికాఫ్టర్లో పుట్టింటికి వెళ్లి.. శుభలేఖలు పంచిన మహిళ
ఇండిగో ఎఫెక్ట్.. కొత్త జంటల తీవ్ర ఇబ్బందులు..
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్డీ చేస్తా... సర్పంచ్ అభ్యర్థి హామీ

