లోన్ తీసుకున్న వారికి భారీ ఉపశమనం.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ
ఆర్బీఐ మరోసారి కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది, దీంతో రెపో రేటు 5.25%కి చేరింది. ఈ ఏడాది ఇప్పటికే 1.25% తగ్గింపులు జరిగాయి. ఈ నిర్ణయం గృహ, వాహన రుణ గ్రహీతలకు గొప్ప ఉపశమనం కలిగిస్తుంది, ముఖ్యంగా 2019 అక్టోబర్ తర్వాత తీసుకున్న ఫ్లోటింగ్ రేట్ రుణాలపై తక్షణ ప్రయోజనాలు లభిస్తాయి.
దేశ ప్రజలకు ఆర్బీఐ నుంచి మరో గుడ్‌న్యూస్ వచ్చేసింది. ఈ ఏడాది ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాంజా ప్రకటించిన ఆర్‌బీఐ..మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. కీలక వడ్డీరేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగొచ్చింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్‌బీఐ.. జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెపో రేటు 1.25శాతం వరకు దిగొచ్చింది. వడ్డీ రేట్లను తగ్గించడంతో గృహ, వాహన రుణ గ్రహీతలకు మరికొంత ఉపశమనం లభించినట్లయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్‌బీఐ.. జూన్ లో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెపో రేటు 1.25 శాతం వరకు దిగొచ్చింది. రెపో రేటు తగ్గింపుతో ఫ్లోటింగ్ రేట్ లోన్ రుణాలు తీసుకున్న వారు తక్షణం ఈ ప్రయోజనాన్ని పొందుతారు. అంటే 2019 అక్టోబర్ 01 తర్వాత బ్యాంకు నుంచి లోన్ పొందిన కస్టమర్లు. ఈ గృహ రుణాల్లో చాలా వరకూ రెపో రేటుకు అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఆర్బీఐ రెపో రేటును తగ్గించినప్పుడు.. ఆయా బ్యాంకులు వెంటనే వడ్డీ రేట్లను సవరిస్తాయి. దీంతో హోమ్ లోన్లు తగ్గింపులు వెంటనే అమల్లోకి వస్తాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చాట్ జీపీటీ తో స్కామర్ కి.. చుక్కలు చూపిన ఢిల్లీ యువకుడు
కాలేజ్‌లో యువతుల సిగపట్లు.. ఇంతకీ గొడవ ఏంటంటే
Brahma Kamalam: అద్భుతం.. ఒకే మొక్కకు 100 బ్రహ్మకమలాలు
చాట్ జీపీటీ తో స్కామర్ కి.. చుక్కలు చూపిన ఢిల్లీ యువకుడు
కాలేజ్‌లో యువతుల సిగపట్లు.. ఇంతకీ గొడవ ఏంటంటే
అద్భుతం.. ఒకే మొక్కకు 100 బ్రహ్మకమలాలు
పాపం.. ప్రాణం తీసిన ఖర్జూరం గింజ.. పెనుకొండ విషాదం
హెలికాఫ్టర్లో పుట్టింటికి వెళ్లి.. శుభలేఖలు పంచిన మహిళ
ఇండిగో ఎఫెక్ట్.. కొత్త జంటల తీవ్ర ఇబ్బందులు..
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్డీ చేస్తా... సర్పంచ్ అభ్యర్థి హామీ

