ఇక దానికి ఆధార్ కార్డు చెల్లదు.. భారీ మార్పులు.. బిగ్ అలర్ట్..
ఆధార్ కార్డు ఇకపై పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంగా చెల్లదు అని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. UIDAI మార్గదర్శకాల ప్రకారం, DOB ధృవీకరణకు జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి. ప్రభుత్వ పథకాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ మార్పు. తప్పుగా ఉన్న పుట్టిన తేదీని ఇప్పుడు కొత్త యాప్ ద్వారా ఇంట్లోనే సులభంగా ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. ఈ నిబంధనలు ఇతర రాష్ట్రాల్లోనూ అమలు కావచ్చు.
అప్పుడే పుట్టిన పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు అందరికీ అవసరమైన గుర్తింపు కార్డు ఆధార్ కార్డు. ఇది లేనిది ఏ పని జరగనంతగా పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రతీఒక్కరూ తమ పాకెట్‌లో ఎప్పుడూ ఆధార్ కార్డు ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతీదానికి ఈ కార్డును గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆధార్ కార్డుల్లో కొన్ని మార్పులు వచ్చాయి.
ఆధార్ కార్డును పుట్టిన తేదీ వెరిఫై చేయడానికి గుర్తింపు పత్రంగా ఉపయోగించకూడదని తాజాగా యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కాదని, దానిని ధృవీకరించడానికి ఉపయోగించవద్దని అన్ని డిపార్ట్‌మెంట్లకు తెలిపింది. డేట్ ఆఫ్ బర్త్ ధృవీకరణకు జనన ధృవీవకరణ పత్రం తప్పనిసరి అని స్పష్టం చేసింది. కొంతమందికి ఆధార్ కార్డులో ఒకలా.. ఇతర సర్టిఫికేట్స్‌లో మరోలా పుట్టిన తేదీ ఉంటుంది. దీని వల్ల కొంతమంది ప్రభుత్వ పథకాలను పొంది నిరూపయోగం చేస్తున్నారు. దీంతో UIDAI నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం పుట్టిన తేదీని నిర్ధారించడానికి ఆధార్ అర్హత పొందదని యూపీ ప్రభుత్వం తెలిపింది. రానున్న రోజుల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే రూల్‌ను తీసుకొచ్చే అవకాశముంది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ముద్రించబడి ఉంటే మార్చుకునే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. ఇంతకముందు డేట్ ఆఫ్ బర్త్‌ను మార్చుకోవడానికి ఆధార్ కార్యాలయానికి తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అసవరం లేకుండానే కొత్తగా తీసుకొచ్చిన యాప్ ద్వారా సులువుగా ఇంటి వద్దనే మార్చుకోవచ్చు. ఆధార్ యాప్‌లోకి వెళ్లి అవసరమైన డాక్యుమెంట్ సమర్పించి అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. ఇక ఇతర వివరాలు సమర్పించాలి. మీరు సమర్పించిన వివరాలు కరెక్ట్‌గా ఉంటే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్‌ను మారుస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తత్కాల్ కౌంటర్ బుకింగ్స్‌లో కీలక మార్పు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఉద్యోగులకు షాక్.. ఇకపై ఎలాంటి పొడిగింపులు ఉండవు !! బాంబు పేల్చిన EPFO
లోన్ తీసుకున్న వారికి భారీ ఉపశమనం.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ
చాట్ జీపీటీ తో స్కామర్ కి.. చుక్కలు చూపిన ఢిల్లీ యువకుడు
కాలేజ్‌లో యువతుల సిగపట్లు.. ఇంతకీ గొడవ ఏంటంటే
అద్భుతం.. ఒకే మొక్కకు 100 బ్రహ్మకమలాలు
పాపం.. ప్రాణం తీసిన ఖర్జూరం గింజ.. పెనుకొండ విషాదం
హెలికాఫ్టర్‌లో పుట్టింటికి వెళ్లి.. శుభలేఖలు పంచిన మహిళ
ఇండిగో ఎఫెక్ట్.. కొత్త జంటల తీవ్ర ఇబ్బందులు..
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్డీ చేస్తా... సర్పంచ్ అభ్యర్థి హామీ

