Gold Price Today: మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా
గత నెలలో భారీగా పెరిగిన పసిడి ధరలు డిసెంబర్‌లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, రూపాయి పతనం పెరుగుదలకు కారణం. అయితే డిసెంబర్ 9న బంగారం స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 22, 24 క్యారెట్ల బంగారం, కిలో వెండి ధరలను తెలుసుకోండి. కొనే ముందు తాజా ధరలను సరిచూసుకోవడం మంచిది.
గత నెలలో సామాన్యులకు కంగారు పుట్టించిన పసిడి ధరలు ఈ నెలలో కూడా అదే వేగంతో దూసుకుపోతున్నాయి. ఇయర్ ఎండింగ్ కావడంతో బంగారం కొనాలనుకునేవారికి నిరాశే ఎదురవుతోంది. ఒక రోజు తగ్గితే.. మరోరోజు భారీగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, రూపాయి విలువ పడిపోడం కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. అయితే డిసెంబరు 9 మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.330 తగ్గి, రూ.1,30,090 కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.300 తగ్గి రూ.1,19,250 పలుకుతోంది. కిలో వెండిపై వెయ్యి రూపాయలు పెరిగి కేజీ వెండి రూ.1,90,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,30,240, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,400 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,090 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,19,250 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,910, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,000 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,090లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,250 లు పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,30,090 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,19,250 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.1,90,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు ఉదయం 10 గంటల తర్వాత నమోదైనవి. ఇవి సాయంత్రానికి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mohammed Kaif: వాళ్లిద్దరూ లేకుండా కప్ గెలవలేం
అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి
సై అంటే సై అంటున్న అన్నదమ్ములు.. తొడగొడుతున్న తోటికోడళ్లు
అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి
సై అంటే సై అంటున్న అన్నదమ్ములు.. తొడగొడుతున్న తోటికోడళ్లు
సర్పంచ్ కుర్చీ కోసం సతి Vs పతి
ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా !!
చాట్ జీపీటీ తో స్కామర్ కి.. చుక్కలు చూపిన ఢిల్లీ యువకుడు
కాలేజ్లో యువతుల సిగపట్లు.. ఇంతకీ గొడవ ఏంటంటే

