AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి

అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి

Phani CH
|

Updated on: Dec 09, 2025 | 2:48 PM

Share

అల్లూరి జిల్లా గొందూరులోని 'భీముని రాయి' సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భీముడు వరాహం కోసం పర్వతంపై పెట్టిన రాయిగా గిరిజనులు నమ్ముతారు. దీనిని అత్యంత నిష్టతో పూజిస్తారు. గాలికి కదిలినా ప్రమాదంలేని ఈ రాయిని చూడటానికి పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ పురాతన కథ స్థానికులను, సందర్శకులను ఆకర్షిస్తోంది.

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ హుకుంపేట మండలం గొందూరులో ఓ పర్వతం ఉంది. దాని అంచున ఓ భారీ బండరాయి కనిపిస్తుంది. అది భీముడి రాయిగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ రాయి దగ్గరకు గిరిజనులు నిష్టతో వెళ్తారు. దీని వెనుక పెద్ద కథే ఉందని పూర్వీకుల నుంచి తమకు తెలిసిందని అంటున్నారు స్థానికులు. ఇటీవల సోషల్ మీడియాలో ఈ రాయి కోసం వైరల్ కావడంతో భీముని రాయి చూసేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో అక్కడికి వెళుతున్నారు. గ్రామస్తుల సమాచారం ప్రకారం.. భీముని కాలంలో ఈ పర్వతంపై నృత్యం చేస్తున్న సమయంలో ఒక వరాహం అటు వైపుగా వెళ్ళిందని.. దాని జాడ కోసం భీముడు వచ్చాడని.. అందులో భాగంగా వరాహం కోసం పర్వతం పై బండరాయి పెట్టి దాని పైకి ఎక్కి చూశారని ప్రచారం. ఆ వరాహం ఈ ప్రాంతానికి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో కొండపైనునున్న భీముడికి కనిపించిందని చెబుతారు. అక్కడే ప్రస్తుతం పంది మెట్టు అనే గ్రామం వెలసిందని అంటున్నారు. పూర్వీకుల కాలం నుంచి తాము ఆ రాయిని అత్యంత నిష్టతో పూజిస్తామని.. ఆ రాయి దగ్గరకు వెళ్లేసమయంలో చెప్పులు కూడా వేసుకోమని గ్రామ నివాసి మచ్చన్న తెలిపారు. తమ గ్రామస్తులు ఆ రాయిని డూంకు రాయి అని కూడా పిలుస్తుంటారు. గాలి వేసినప్పుడు రాయి కదులుతూ ఉంటుందని కానీ… ఏళ్లుగా ఆ రాయి కారణంగా ఎటువంటి ప్రమాదం జరగలేదని అంటున్నారు. ఆ రాయిని దేవుడే ప్రతిష్టించారని గ్రామస్తులు విశ్వాసం. చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా చందాలు వేసుకొని పండగలు కూడా చేస్తామని అంటున్నారు స్థానికులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సై అంటే సై అంటున్న అన్నదమ్ములు.. తొడగొడుతున్న తోటికోడళ్లు

ఔను.. మా పెళ్లి రద్దయింది.. ఇక నా దృష్టి కేవలం దానిపైనే

సర్పంచ్ కుర్చీ కోసం సతి Vs పతి

ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది

వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా !!