AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సై అంటే సై అంటున్న అన్నదమ్ములు.. తొడగొడుతున్న తోటికోడళ్లు

సై అంటే సై అంటున్న అన్నదమ్ములు.. తొడగొడుతున్న తోటికోడళ్లు

Phani CH
|

Updated on: Dec 09, 2025 | 1:58 PM

Share

తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు పలు కుటుంబాల్లో కలహాలకు కారణమవుతున్నాయి. అధికారం కోసం అన్నదమ్ములు, తోటికోడళ్లు, అత్తాకోడళ్లు సైతం ఒకరిపై ఒకరు పోటీపడుతున్నారు. మహబూబాబాద్‌లో అన్నదమ్ముల మధ్య, జనగామలో తోటికోడళ్ల మధ్య సాగుతున్న హోరాహోరీ పోరు పల్లెల్లో చర్చనీయాంశంగా మారింది. గ్రామ ప్రథమ పౌరుడు కావాలనే తపన బంధాలను తెంచుతోంది.

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు పలు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఓ చోట స్వంత అన్నదమ్ములు సై అంటే సై అంటుంటే.. మరోచోట తోటి కోడళ్ళు, అత్తా కోడళ్ళు తొడగొడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు వారి కుటుంబాలలో పంచాయతీకి కారణం అవుతున్నాయి.తెలంగాణ పల్లెపోరులో చోటు చేసుకుంటున్న కొన్నివిచిత్రాలు మీకోసం. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గ్రామ ప్రథమ పౌరుడు కావాలనే తపనతో పోటీ పడుతున్నవారు జనంలో చర్చగా మారుతున్నారు. ఇంట్లో అన్న – తమ్ముడు , అక్క – చెల్లి, అత్త కోడలని ఆప్యాయంగా పలకరించుకునే కుటుంబాల మధ్య ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు చిచ్చుపెట్టాయి.. స్వంత కుటుంబ సభ్యులే పోటాపోటీగా బరిలోకి దిగి పరస్పర విమర్శలతో జనంలో చర్చగా మారుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పీఠం కోసం సొంత అన్నదమ్ములు పోటీ పడుతున్నారు.. సర్పంచ్ పదవి కైవసం చేసుకునేందుకు అనేక పాట్లు పడుతున్నారు. అన్న పులి వెంకన్న కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలోకి దిగగా.. తమ్ముడు పులి రామచంద్రు బిఆర్ఎస్ పార్టీ నుండి రంగంలోకి దిగాడు. సొంత అన్నదమ్ములైనా మమకారాలు విడిచి, తమ పార్టీ గెలవాలంటే, తమ పార్టీయే గెలవాలని హోరాహోరీ ప్రచారంతో దూసుకుపోతున్నారు. అన్న వెంకన్న గతంలో సర్పంచ్, ఎంపీటీసీ పదవులకు పోటీచేసి ఓటమిపాలయ్యాడు. తమ్ముడు రామచంద్ర మాత్రం ఒకసారి ఎంపీటీసీగా గెలుపొందాడు. తనకు ఎంపీటీసీగా చేసిన అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు గ్రామంలో ఇంకా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని ఆ అనుభవం తనకు ఉందని గ్రామస్తులు తనకు మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాడు.మరోవైపు అన్న వెంకన్న మాత్రం ఇప్పుడు తమ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి త్వరితగతిన పనులు పూర్తి చేస్తానని గ్రామంలో సదుపాయాలు తెస్తానంటూ ప్రచారం చేస్తున్నారు. సర్పంచ్ పీఠం కోసం పరస్పర విమర్శలు, గెలుపు వ్యూహాలతో జనంలో చర్చగా మారుతున్నారు. మరోవైపు జనగామ జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు తోటి కోడళ్ల మధ్య కొత్త పంచాయతీకి కారణం అయ్యాయి. రఘునాథపల్లి మండలం ఫతేశాపూర్ సర్పంచ్ బరిలో తోటికోడళ్ళు రంగంలోకి దిగారు. 1,237 మంది ఓటర్లు కలిగిన ఈ గ్రామ సర్పంచ్ స్థానం ఈసారి బీసీ మహిళకు రిజర్వ్ అయింది.. కాంగ్రెస్ పార్టీ అక్కనపల్లి సుజాత అనే మహిళను బరిలోకి దింపగా , టిఆర్ఎస్ పార్టీ ఆమె తోటి కోడలు అక్కనపల్లి మాధవిని బరిలోకి దింపింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి ఈ ఇద్దరు తోటి కోడళ్ళు మాత్రమే బరిలో నిలిచారు. దీంతో ఫతేషాపూర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. తోటి కోడళ్ళు నువ్వా..నేనా అంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఔను.. మా పెళ్లి రద్దయింది.. ఇక నా దృష్టి కేవలం దానిపైనే

సర్పంచ్ కుర్చీ కోసం సతి Vs పతి

ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది

వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా !!

ఇక దానికి ఆధార్ కార్డు చెల్లదు.. భారీ మార్పులు.. బిగ్ అలర్ట్..