ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది
జగిత్యాలలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆస్తి పంపకాల వివాదంతో కుర్రె లక్ష్మి అనే వృద్ధ తల్లిని ఆమె కొడుకులు నడిరోడ్డుపై వదిలేశారు. తిండి, నీళ్లు లేకుండా చలికి వణికిపోతున్న తల్లిని గమనించిన జగిత్యాల ఆర్డీవో మధుకర్ జోక్యం చేసుకున్నారు. కొడుకులకు ఫోన్ చేసి, తల్లిని వెంటనే తీసుకెళ్లాలని ఆదేశించారు. కొడుకుల నిర్లక్ష్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవసాన దశలో అమ్మకు అండగా ఉండాల్సిన కన్నబిడ్డలు ఆ తల్లిని అనాధగా వదిలేసారు. నమ్మించి నడిరోడ్డులో వదిలేశారు. ఈ హృదయ విదారక ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. కొడుకుల నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధురాలు రోజంతా ఆర్డీవో కార్యాలయం ఎదుట తిండి, నీళ్లు లేకుండా చలికి వణికిపోతూ గడపాల్సి వచ్చింది. మల్యాలకు చెందిన కుర్రె లక్ష్మీ అనే వృద్ధురాలి భర్త నారాయణ దాసు మరణించడంతో ఆమె తన ఇద్దరు కొడుకులు కుర్రె కృష్ణ, కుర్రె శ్రీనివాస్ వద్ద ఉంటోంది. ఆస్తి పంపకాల్లో భాగంగా చిన్న కొడుకు శ్రీనివాస్‌కు పాత ఇల్లు వచ్చింది. దీంతో అందరికీ సరిపోదనే ఉద్దేశంతో నాటి నుంచి వేరే అద్దె ఇల్లు తీసుకుని, తల్లిని అక్కడే ఉంచాడు. కాగా, ఇటీవల శ్రీనివాస్ ఆ పాత ఇంటిని కూల్చి కొత్త ఇల్లు నిర్మాణం చేశాడు. దీంతో, కొడుకు వద్ద ఉండేందుకు ఆరాటపడిన తల్లిని కొత్త ఇంట్లోకి రానివ్వకుండా శ్రీనివాస్ అడ్డుపడ్డాడు. దీంతో ఆమె పెద్ద కొడుకు కృష్ణ వద్ద ఉండాల్సి వచ్చింది. కృష్ణ కూడా సరిగా చూసుకోవడం లేదని భావించిన లక్ష్మీ.. మళ్లీ చిన్న కొడుకు శ్రీనివాస్ వద్దకు వెళ్లగా, అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగింది. సమస్యను పరిష్కరించే నెపంతో చిన్న కొడుకు శ్రీనివాస్.. “ఆర్డీవో ఆఫీస్‌కు వెళ్లు, నేను కూడా వస్తాను” అని తల్లిని నమ్మించి ఆటోలో జగిత్యాల ఆర్డీవో కార్యాలయానికి పంపించాడు. అయితే ఉదయం కార్యాలయానికి చేరుకున్న ఆ వృద్ధురాలి కోసం సాయంత్రమైనా ఏ కొడుకూ రాలేదు. దీంతో లక్ష్మీ ఆర్డీవో కార్యాలయం ఎదుటే తిండి, నీళ్లు లేకుండా, చలికి వణికిపోతూ నిరీక్షించింది. ఈ హృదయ విదారక దృశ్యాన్ని గమనించిన ఆర్డీవో మధుకర్ స్వయంగా ఆమె వద్దకు వచ్చి పరిస్థితిని ఆరా తీశారు. కొడుకులు తల్లిని ఇలా నిర్లక్ష్యంగా వదిలేసిన విషయం తెలుసుకుని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెద్ద కొడుకు కృష్ణకు ఫోన్ చేసి తల్లిని తక్షణమే ఇంటికి తీసుకెళ్లాలని, సోమవారం ఇద్దరు కొడుకులు తన ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీవో ఆదేశాల మేరకు పెద్ద కొడుకు కృష్ణ వచ్చి తల్లిని తన వెంట తీసుకెళ్లాడు. కొడుకుల నిర్లక్ష్యంతో అవమానానికి, చలి బాధలకు గురైన వృద్ధురాలి పట్ల ఆర్డీవో స్పందించిన తీరుకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా !!
ఇక దానికి ఆధార్ కార్డు చెల్లదు.. భారీ మార్పులు.. బిగ్ అలర్ట్..
తత్కాల్ కౌంటర్ బుకింగ్స్‌లో కీలక మార్పు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఉద్యోగులకు షాక్.. ఇకపై ఎలాంటి పొడిగింపులు ఉండవు !! బాంబు పేల్చిన EPFO
లోన్ తీసుకున్న వారికి భారీ ఉపశమనం.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ
ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా !!
చాట్ జీపీటీ తో స్కామర్ కి.. చుక్కలు చూపిన ఢిల్లీ యువకుడు
కాలేజ్‌లో యువతుల సిగపట్లు.. ఇంతకీ గొడవ ఏంటంటే
అద్భుతం.. ఒకే మొక్కకు 100 బ్రహ్మకమలాలు
పాపం.. ప్రాణం తీసిన ఖర్జూరం గింజ.. పెనుకొండ విషాదం
హెలికాఫ్టర్‌లో పుట్టింటికి వెళ్లి.. శుభలేఖలు పంచిన మహిళ

