పిల్లలు చిలగడ దుంపలు తినొచ్చా?

07 December 2025

TV9 Telugu

TV9 Telugu

చిలగడదుంపలు రుచికరంగా ఉండటమే కాకుండా.. పిండి పదార్థాలు కూడా దండిగా ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ముట్టుకోరు

TV9 Telugu

ఒకే ఆహారం... శరీర బరువును తగ్గించడంలో, వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో, క్యాన్సర్‌ కణాలతో పోరాడటంలోనూ ఉపయోగపడితే కచ్చితంగా ఏదైనా ఉందంటే అది చిలకడ దుంపలే..

TV9 Telugu

అందుకే చిలగడ దుంపల్ని బెస్ట్‌ రూట్‌ వెజిటబుల్‌గా చెబుతారు. దీని ద్వారా శరీరానికి ఎన్నో ఖనిజాలూ, విటమిన్లూ అందుతాయి. ముఖ్యంగా బీటా కెరొటిన్, విటమిన్‌ ఎ, సి, ఈ, బి-6, పొటాషియం, పీచు ఎక్కువగా లభిస్తాయి

TV9 Telugu

రోజూ ఒక దుంప తినిపించడం వల్ల పిల్లలకు సీజనల్‌గా వచ్చే దగ్గూ, జలుబుల్లాంటి అనారోగ్య సమస్యల్ని దరిచేరనివ్వదు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల బాగుంటుంది. అందుకే పిల్లలకు తప్పకుండా వీటిని ఇవ్వాలి

TV9 Telugu

పొట్ట ఆరోగ్యానికి ఈ దుంపలోని పీచు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంతోపాటు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది

TV9 Telugu

చిలగడదుంపలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరచడం, మెదడు పనితీరును మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం చేస్తుంది

TV9 Telugu

ఉడికించిన చిలగడదుంపల కంటే నిప్పుల మీద కాల్చిన చిలగడదుంపలు మరింత రుచిగా ఉంటాయి. చిలగడ దుంప కండరాల కదలికలకీ, ఎముకల బలానికీ సాయపడుతుంది

TV9 Telugu

దుంపల జోలికే వెళ్లరు మధుమేహులు. కానీ గ్లైసమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండే ఈ తీపి గడ్డని హాయిగా తినొచ్చు. రక్తంలో చక్కెర స్థాయుల్ని క్రమబద్ధం చేస్తూ పీచును అందిస్తుంది కాబట్టి దీంతో ఎలాంటి ఇబ్బందీ ఉండదట