Beauty Tips: వేసవిలో పుదీనాతో చర్మం కాంతివంతం.. ఇలా ట్రై చేసి చూడండి..!
Beauty Tips: చలికాలం కంటే వేసవిలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ సీజన్‌లో వచ్చే టానింగ్ వల్ల చర్మం డల్‌గా మారుతుంది. దీనిని రి
Beauty Tips: చలికాలం కంటే వేసవిలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ సీజన్‌లో వచ్చే టానింగ్ వల్ల చర్మం డల్‌గా మారుతుంది. దీనిని రిపేర్ చేయడం అంత సులభం కాదు. వేసవిలో చర్మానికి రెట్టింపు జాగ్రత్త అవసరం. మీరు వేసవిలో చర్మ సంరక్షణ కోసం మార్కెట్‌లో సమ్మర్ ప్రొడక్ట్స్‌ని చూసే ఉంటారు. కానీ వీటివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకే ఇంట్లోనే కొన్ని చిట్కాల ద్వారా అందమైన ముఖాన్ని పొందవచ్చు. పుదీనా ద్వారా ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు. ఇందులో ఉండే ఔషధ గుణాలు చర్మాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తాయి. అందుకే దీనిని ఔషధ మూలిక అంటారు. పుదీనాలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మంపై ఉండే మొటిమలను తొలగిస్తాయి. దీని ఫేస్ ప్యాక్‌ను తయారు చేయడం ద్వారా మీరు మంచి గ్లో పొందవచ్చు. దీనిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
దోసకాయ, పుదీనా ప్యాక్
వేసవిలో చర్మాన్ని తేమగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు దోసకాయ సహాయం తీసుకోవచ్చు. తురిమిన దోసకాయ రసాన్ని ఒక గిన్నెలో వేసి అందులో పుదీనా ఆకుల పేస్ట్ లేదా రసాన్ని కలపండి. దానిని ముఖానికి పట్టించి ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మెరుస్తుంది.
తులసి, పుదీనా ప్యాక్
పుదీనాలాగే తులసిలో కూడా ఔషధ గుణాలుంటాయి. ఇది చర్మానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. గ్రైండర్‌లో తులసి, పుదీనా ఆకులను వేసి మెత్తగా చేయాలి. దానికి వేప ఆకులు కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి కొంతసేపు ఆరనివ్వాలి. తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పద్ధతి వల్ల చర్మం మెరిసిపోవడమే కాకుండా ముఖంపై ఉండే మొటిమలు కూడా మాయమవుతాయి.
పుదీనా, ముల్తానీ మట్టి
చర్మ సంరక్షణలో ముల్తానీ మట్టిని చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది మొటిమల సమస్యని దూరం చేస్తుంది. ముఖ కాంతిని పెంచుతుంది. ముల్తాని మట్టిలో పుదీనా మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చు. ఒక పాత్రను తీసుకుని అందులో ముల్తానీ మట్టిని నానబెట్టాలి. దానికి పుదీనా ఆకుల రసాన్ని కలిపి ఈ ప్యాక్‌ని ముఖానికి పట్టించాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడగాలి. తరచుగా ఇలాచేస్తే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.