AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomorrow School Holiday: రేపు అన్ని విద్యాసంస్థలు బంద్.. కారణం ఇదే!

Tomorrow School Holiday December 9: దేశ వ్యాప్తంగా చలి గాలులు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో డిసెంబర్ రెండవ భాగంలో శీతాకాల సెలవులను ప్రకటిస్తాయి.ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలో తగ్గుదల ఎక్కువగా ఉండటంతో ..

Tomorrow School Holiday: రేపు అన్ని విద్యాసంస్థలు బంద్.. కారణం ఇదే!
Tomorrow School Holiday
Srilakshmi C
|

Updated on: Dec 08, 2025 | 3:10 PM

Share

దేశ వ్యాప్తంగా చలి గాలులు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో డిసెంబర్ రెండవ భాగంలో శీతాకాల సెలవులను ప్రకటిస్తాయి. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలో తగ్గుదల ఎక్కువగా ఉండటంతో పలు రాష్ట్రాలు దాదాపు 9 నుంచి 10 రోజుల పాఠశాల సెలవులకు సిద్ధమవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, హర్యానా వంటి కొన్ని రాష్ట్రాలు శీతాకాల పరిస్థితుల కారణంగా డిసెంబర్ చివరిలో బ్లాక్ సెలవులను ప్రకటిస్తాయి. వీటితో పాటు క్రిస్మస్, గురు గోవింద్ సింగ్ జయంతి, గోవా విమోచన దినోత్సవం వంటి జాతీయ, ప్రాంతీయ పండుగల సెలవులు కూడా డిసెంబర్‌ నెలలో రానున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్న క్రమంలో రాబోయే రోజుల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులకు సంబంధించిన అధికారిక రాష్ట్ర నోటిఫికేషన్‌లు జారీ చేసే అవకాశం ఉంది.

మరోవైపు పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలకు ఇటీవల ఎన్నికల సంఘం షెడ్యూళ్లను విడుదల చేసింది. ఈ క్రమంలో కేరళతో పాటు కొన్ని రాష్ట్రాల్లో మంగళవారం స్థానిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో డిసెంబర్ 9 నుంచి 11వ తేదీల వరకు ప్రభుత్వ పాఠశాలలకు సెలవులను ఇస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన వెలువరించింది. దీంతో ఆ రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు కూడా ఆయా తేదీల్లో సెలవులు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగులందరికీ పోలింగ్ తేదీల్లో వేతనాలతో కూడిన సెలవు దినాలను కూడా మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే కేరళ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా సెలవుల షెడ్యూల్‌ని కూడా అధికారికంగా ప్రకటించింది.

కేరళ రాష్ట్రంలోని మంగళవారం మొత్తం 8 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు రానున్నాయి. ఇందులో భాగంగా తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇక డిసెంబర్ 11వ తేదీన మరికొన్ని జిల్లాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దీని కారణంగా ఆయా జిల్లాల్లో కూడా ప్రత్యేకమైన సెలవులను ఇప్పటికే కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 11న త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురంతో పాటు కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసరగోడ్ జిల్లాలో సెలవు స్కూళ్లకు సెలవు రానుంది. కాగా కేరళ రాష్ట్రంలో 1200 స్థానిక సంస్థలకు గాను 119 స్థానిక సంస్థలకు డిసెంబర్ 9, డిసెంబర్ 11 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్లో భాగంగా గ్రామపంచాయతీలు, బ్లాక్ పంచాయతీలు, జిల్లా పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.