చలి పులికి భయపడకండి..! ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే బెల్లం మసాలా ఛాయ్ ఉండగా..
శీతాకాలంలో ఆరోగ్యం కాపాడుకోవడం ముఖ్యం, ఎందుకంటే రోగనిరోధక శక్తి తగ్గి జలుబు, దగ్గు సమస్యలు వస్తాయి. బెల్లం మసాలా చాయ్ తాగడం వలన శరీరానికి వేడి, శక్తి లభిస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అల్లం, ఏలకులతో కూడిన ఈ చాయ్ జీర్ణక్రియను మెరుగుపరచి, చలికాలపు వ్యాధుల నుండి ఉపశమనం ఇస్తుంది.

శీతాకాలం చలి చంపేస్తోంది. ఇదే వాతావరణం ఇంకా మరో రెండు మూడు నెలలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలోనే చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడు కోవటం అతి ముఖ్యం. ఎందుకంటే.. ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. సులువుగా వ్యాధుల బారినపడే అవకాశం ఉంటుంది. తరచూ జలబు, దగ్గు వంటి సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అయితే, చలికాలంలో బెల్లం మసాలా చాయ్ తాగడం వలన శరీరానికి వేడి, శక్తి ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బెల్లం రక్తాన్ని శుద్ధి చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అల్లం, ఏలకులు కలిసిన ఈ చాయ్ జీర్ణ క్రియ మెరుగు పర్చడం తో పాటు జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది. అయితే, ఈ చాయ్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
బెల్లం మసాలా చాయ్ కోసం ఒక గిన్నెలో కావలిసినంత నీటిని తీసుకోని మరిగించాలి. మరుగుతున్న నీటిలో అల్లం ముక్కలు, ఏలకులు వేసి వాసన వచ్చే వరకు మరిగించాలి. ఒక టీ గ్లాస్ అంత నీటికి ఒక టీ స్పూన్ చొప్పున టీ పొడి వేసి 5 నిమిషాలు మంచి రంగు వచ్చే వరకు కాచుకోవాలి. మనకు చాయ్ స్ట్రాంగ్ లేదా లైట్ గా కావలసిన దానిని బట్టి పాలు వేసి మెల్లగా కలుపుతూ 3 నిముషాలు మరిగించండి. తీపి రుచిని బట్టి బెల్లం ముక్కలు వేసి అవి కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు టీ ని వడకట్టి కప్పులో పోసి సర్వ్ చేసుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








