AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అది ఇది వద్దు.. కోడి కాళ్ల పులుసు ఇలా చేశారంటే తెపాళ్ల గిన్నె మొత్తం ఊడ్వాల్సిందే..

Kodi kalla pulusu: కోడి కాళ్లు.. (Chicken Feet) పోషకాల గని. వీటిలో కొల్లాజెన్, ప్రోటీన్, కాల్షియం, భాస్వరం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించి, చర్మ సౌందర్యాన్ని పెంచి, ఎముకలను బలోపేతం చేస్తాయని డైటీషియన్లు చెబుతున్నారు. దీంతోపాటు.. రోగనిరోధక శక్తిని పెంచి, రక్తహీనతను నివారించడంలో, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు కూడా ఇవి సహాయపడతాయని పేర్కొంటున్నారు.

అది ఇది వద్దు.. కోడి కాళ్ల పులుసు ఇలా చేశారంటే తెపాళ్ల గిన్నె మొత్తం ఊడ్వాల్సిందే..
Kodi Kalla Pulusu Recipe
Shaik Madar Saheb
|

Updated on: Mar 09, 2026 | 9:09 AM

Share

Kodi kalla pulusu: కోడి కాళ్లు.. (Chicken Feet) పోషకాల గని. వీటిలో కొల్లాజెన్, ప్రోటీన్, కాల్షియం, భాస్వరం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించి, చర్మ సౌందర్యాన్ని పెంచి, ఎముకలను బలోపేతం చేస్తాయని డైటీషియన్లు చెబుతున్నారు. దీంతోపాటు.. రోగనిరోధక శక్తిని పెంచి, రక్తహీనతను నివారించడంలో, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు కూడా ఇవి సహాయపడతాయని పేర్కొంటున్నారు. నాన్ వెజ్ ప్రియులు.. కోడి కాళ్లను చాలా మంది తింటారు.. కోడి కాళ్లను పులుసు మాదిరిగా ఇష్టంగా వండుకుని.. ఆస్వాదిస్తారు.. దీని రుచి అద్భుతంగా ఉంటుంది.. కోడి కాళ్ళు తినడం వల్ల శరీరంపై సానుకూల ప్రభావాలు కనిపిస్తాయని.. ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

వాస్తవానికి కోడి కాళ్ళ పులుసు తెలుగు వంటకాల్లో ఒక ప్రత్యేకమైన రుచి. ఈ పులుసును తయారు చేయడానికి ముందుగా కోడి కాళ్ళను స్టవ్ మీద కాల్చి, వాటిపై ఉన్న తోలును, గోర్లను తీసివేయాలి. శుభ్రం చేసిన కోడి కాళ్ళను చిన్న ముక్కలుగా కట్ చేసి కడగాలి.

తయారీకి కావలసిన పదార్థాలు:

కోడి కాళ్ళు, నూనె, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, టమాటో, కారం, నీళ్లు, రోట్లో దంచిన మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర.

వంట ప్రారంభించడానికి, కడాయిలో నూనె వేసి, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకున్న కోడి కాళ్ళను వేసి బాగా కలపాలి. తరిగిన టమాటో ముక్కలు వేసి పది నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి.

టమాటో మగ్గిన తర్వాత కారం, ఒక గ్లాసు నీళ్లు పోసి, గ్రేవీ చిక్కబడేంత వరకు పది నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా రోట్లో దంచిన మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర వేసి రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఇంతటితో ఎంతో రుచిగా ఉండే కోడి కాళ్ళ పులుసు సిద్ధం అవుతుంది.. వేడి వేడి అన్నంలోకి ఈ పులుసు అద్భుతమైన రుచిని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వంటకాన్ని ఇంట్లో ప్రయత్నించి, అద్భుతమైన రుచిని ఆస్వాదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చెప్పుకోండి చూద్దాం.! మనుషులను చూసి సిగ్గుపడే జంతువు ఏదో తెల్సా..
చెప్పుకోండి చూద్దాం.! మనుషులను చూసి సిగ్గుపడే జంతువు ఏదో తెల్సా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్
15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్