అదిరిపోయే లుక్‌లో అందాల భామ.. రుక్మిణి బ్యూటిఫుల్ ఫొటోస్
అందాల ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది.
Updated on: Dec 08, 2025 | 2:23 PM

అందాల ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైన ఫిదా అవ్వాల్సిందే. ఈ చిన్నది కాంతార చాప్టర్ 1 మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రేంజ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

రుక్మిణి వసంత్ సప్త సాగరాలు దాటి అనే సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకుంది. తర్వాత కాంతార చాప్టర్ 1 మూవీలో యువరాణిలా తన అంద చందాలతో అందరినీ కట్టి పడేసి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

ఈ కన్నడ బ్యూటీ బెంగళూరుకు చెంది ఆర్మీ కుటుంబం నుంచి వచ్చింది. ఈ అమ్మడు నాన్న కల్నల్ వసంత్ వేణుగోపాల్, తల్లి సుభాషిణి, వీరికి ఒక చెల్లి కూడా ఉంది. రుక్మిణి వసంత్ సినిమాలపై ఉన్న ఇట్రస్ట్‌తో మోడలింగ్ లోకి అడుగు పెట్టి, చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

కన్నడ మూవీ బీర్బల్ ట్రైయాలజీ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత హిందీలో అప్ స్టార్ట్స్ అనే మూవీతో అరగేట్రం చేసింది. కానీ ఈ రెండు సినిమాలో రాని గుర్తింపు సప్తసాగరాలు దాటి మూవీతో సంపాదించుకుంది.

ఇక ఈ మూవీ తర్వాత కాంతార చాప్టర్ 1లో నటించి పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్టీఆర్ నీల్ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుంది. అంతే కాకుండా పలు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం.



