08 December 2025

బ్రేక్ ఫాస్ట్‌లో పదే పదే బ్రెడ్ ఆమ్లేట్ తింటున్నారా?

samatha

Pic credit - Instagram

ఈ మధ్య కాలంలో చాలా మంది అల్పాహారం సమయంలో బ్రెడ్ ఆమ్లెట్ ఎక్కువగా తీసుకుంటున్నారు. చాలా త్వరగా పూర్తి అవ్వడం టేస్ట్ ఉండటంతో ఎక్కువ మంది దీనికే ఇంట్రస్ట్ చూపుతున్నారు.

ఇక బ్రేక్ ఫాస్ట్‌లో బ్రెడ్ ఆమ్లెట్ తినడం వలన కడుపు నిండిన భావన కలగడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ దీనిని ప్రతి రోజూ తినడం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంట.

బ్రెడ్ ఆమ్లెట్‌కు ఎక్కువగా బ్రౌన్ బ్రెడ్ ఉపయోగించడం మంచిది. ఇందులో ఉండే కార్బో హైడ్రేట్స్, ఫైబర్ , ప్రోటీన్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ ఇ, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

కోడి గుడ్లలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ బి12 చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే సెలీనియం, జింక్ , కోలిన్ వంటి పోషకాలు శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందేలా చేస్తుంటాయి.

అందువలన బ్రెడ్ ఆమ్లెట్ ఆరోగ్యానికి మంచిదే. కానీ దీనిని అతిగా తీసుకోవడం వలన  తరచూ ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంట. అందుకే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని మితంగా తినడం మంచిదంట.

అలెర్జీ సమస్యలతో బాధపడే వారు అస్సలే గుడ్లు తినకూడదంట. దీంతో బాధపడే వారు తరచూ బ్రెడ్ ఆమ్లెట్ తింటే సమస్య మరింత తీవ్రతరం అవుతుందంట.

అదే విధంగా అలసట, బలహీనత, సెలియాక్ వ్యాధి ఉన్న వారు కూడా తరచూ బ్రెడ్ ఆమ్లెట్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అలాగే జీర్ణ సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ, కడుపులో మంట వంటి ఇబ్బందులు ఉన్నవారు కూడా బ్రెడ్ ఆమ్లెట్ అతిగా తినకూడదు అంటున్నారు నిపుణులు.