పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ ఒక పండు తినడం వలన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అందుకే చాలా మంది ఎక్కువగా ఫ్రూట్స్ తింటారు.
ఇక పండ్లలో విటమిన్స్, మినరల్స్ వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువలన ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అందుకే తప్పకుండా రోజుకు ఒక్క పండు అయినా తినాలి అంటారు నిపుణులు.
అయితే పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ కొన్ని పండ్లు మాత్రం అస్సలే రాత్రి సమయంలో తినకూడదంట. ముఖ్యంగా శీతాకాలంలో తినకూడదు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పొటాషియం, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కానీ దీనిని చలికాలంలో రాత్రి సమయంలో అస్సలే తినకూడదంట.
జామ కాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని శీతాకాలంలో రాత్రి సమయంలో తినడంవలన ఇది కడుపు నొప్పి వంటి సమస్యలకు కారణం అవుతుంది.
నారింజ పండ్లలో విటమిన్ సి ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది సిట్రస్ ఫ్రూట్ కావడం వలన దీనిని అస్సలే రాత్రి సమయంలో తినకూడదంట. దీని వలన గుండెల్లో మంట పెరుగుతుంది.
అలాగే, మామిడి పండ్లను, మామిడి పండ్ల రసాలను కూడా రాత్రి సమయంలో తీసుకోకూడదు. దీని వలన తర్వగా బరువు పెరిగే ఛాన్స్ ఉన్నదంట.
అదే విధంగా పుచ్చకాయ పండు కూడా శరీరానికి చాలా మేలు చేస్తుంది. కానీ దీనిని కూడా రాత్రి సమయంలో తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు.