Health News: కరోనా తర్వాత ఈ వ్యాధి బాధితులు పెరుగుతున్నారు.. మీలో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త..!
Health News: కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలామంది వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా శ్వాసకోశ
Health News: కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలామంది వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, ఎముక సంబంధిత వ్యాధులు ఉన్నాయి. వీటినుంచి ప్రజలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. గత ఐదు నుంచి ఆరు నెలలుగా ఈ వ్యాధులకి గురయ్యే వారి సంఖ్య పెరిగిపోతుంది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అవాస్కులర్ నెక్రోసిస్ ఉన్న చాలా మంది రోగులు ఆసుపత్రులకు వస్తున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కరోనా సమయంలో స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఇది జరుగుతోంది. ఈ వ్యాధి కారణంగా రోగుల తుంటిలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీని కారణంగా ఎముక కణజాలం దెబ్బతింటుంది. రక్తం లేకపోవడం వల్ల శరీరంలోని ఎముకలు పెలుసుగా మారుతున్నాయి. ఈ వ్యాధి ఎముకలను నాశనం చేస్తుంది. అందుకే దీన్ని డెత్ ఆఫ్ బోన్ అని కూడా అంటారు.
అవాస్కులర్ నెక్రోసిస్ లక్షణాలు
తొడ, తుంటి ఎముకలలో తీవ్రమైన నొప్పి, నడవడం కష్టమవడం, మోకాలి, అంత్య భాగాల నొప్పి, కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ డి లోపించడంతో పిల్లలు ఎక్కువగా రికెట్స్‌తో బాధపడుతున్నారు. ఎందుకంటే లాక్‌డౌన్ కారణంగా పిల్లలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. దీంతో విటమిన్ డి లోపం ఏర్పడింది. దీని కారణంగా పిల్లలు బలహీనత, అలసట, శరీర నొప్పులు సమస్యలు పెరిగాయి. అందుకే కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల వీటినుంచి బయటపడవచ్చు. విటమిన్ డి క్యాప్సల్స్ తీసుకుంటే మంచిది. శీతల పానీయాలు, షాంపైన్ వంటి కార్బోనేటేడ్ పానీయాలను తాగకూడదు. ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవద్దు. కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలని డైట్‌లో చేర్చుకోవాలి.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.