AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Costly Stock: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాక్ ఏంటో తెలుసా? ధర వింటే మూర్ఛ పోవాల్సిందే..

World Most Expensive Stock: చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు చౌక స్టాక్‌లపై దృష్టి పెడుతుంటారు. అయితే, వీరి చూపు కూడా ఎక్కువగా వాటిపైనే ఉంటుంది. అయితే, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాక్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా?

Costly Stock: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాక్ ఏంటో తెలుసా? ధర వింటే మూర్ఛ పోవాల్సిందే..
stock Market
Venkata Chari
|

Updated on: Apr 20, 2022 | 5:33 PM

Share

World Most Expensive Stock: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. భారతదేశంలో కూడా, స్టాక్ మార్కెట్‌(Stock Market)లో పెట్టుబడులు పెట్టే ధోరణి వేగంగా పెరిగింది. ముఖ్యంగా గత రెండేళ్లలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య వేగంగా పెరగడమే ఇందుకు కారణం. వాస్తవానికి, చిన్న మొత్తంతో పెట్టుబడి(Investment) పెట్టడం ప్రారంభించాలని పెట్టుబడిదారులకు ఎల్లప్పుడూ సలహా ఇస్తుంటారు. మంచి రాబడి కోసం ప్రజలు పెద్ద కంపెనీలలో పెట్టుబడి పెడుతుంటారు. అన్ని స్టాక్‌లు వేర్వేరు ధరలను కలిగి ఉంటాయి. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు చౌక స్టాక్స్‌పై దృష్టి పెడతారు. అదే సమయంలో, ప్రపంచంలో ఒకటి కంటే ఎక్కువ ఖరీదైన స్టాక్‌లు ఉన్నాయని మీకు తెలుసా? కొన్ని షేర్ల ధరలను వింటే మాత్రం మూర్ఛ పోవాల్సిందే. వాటిపై పెట్టుబడి పెట్టాలంటేనే దడపుట్టిస్తాయి.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాక్..

ప్రపంచంలో అత్యంత ఖరీదైన షేర్లు ఏవి? ఆ కంపెనీ యజమాని ఎవరు? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాక్ ధర కోట్లలో ఉంది. Berkshire Hathaway Inc. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాక్‌గా నిలిచింది. ఈ కంపెనీకి చెందిన ఒక షేరు ధర రూ.4 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. ఏప్రిల్ 20 నాటికి, Berkshire Hathaway Inc. షేరు ధర $ 523550 ( సుమారు రూ. 4,00,19,376)గా ఉంది. ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటే మాత్రం.. కనీసం రూ.4 కోట్లు ఉంటేనే సాధ్యమవుతుంది. అలాంటి వారు మాత్రమే వాటాను కొనుగోలు చేయగలరు. ఇటువంటి పరిస్థితిలో, బెర్క్‌షైర్ హాత్వే ఇంక్‌లో పెట్టుబడి పెట్టడం చాలా మందికి కలగా మిగిలిపోయింది.

బలమైన వ్యాపారం..

ఈ బెర్క్‌షైర్ హాత్వే ఇంక్ కంపెనీకి అధిపతి ఎవరో తెలుసా? వారెన్ బఫెట్‌కు ప్రస్తుతం ఎలాంటి గుర్తింపు అవసరం లేదు. ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతుంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్టాక్ కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే ఇంక్ చీఫ్ వారెన్ బఫెట్ అని మీకు తెలుసా? అవునండీ.. నమ్మలేకపోతున్నారు కదూ. కానీ, అదే నిజం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పెట్టుబడిదారు వారెన్ బఫెట్‌ను ప్రజలు అనుసరిస్తుంటారు. వారెన్ బఫెట్ ఇన్వెస్ట్ చేసే కంపెనీ రోజులు మారతాయని టాక్ ఉంది. ఫోర్బ్స్ ప్రకారం, బెర్క్‌షైర్ హాత్వేలో వారెన్ బఫెట్‌కు 16 శాతం వాటా ఉంది. కంపెనీ వ్యాపారంలో ఎక్కువ భాగం అమెరికాలోనే ఉంది. కంపెనీలో దాదాపు 3,72,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బెర్క్‌షైర్ హాత్వే ఇంక్ అమెరికాతో పాటు చైనాలోనూ విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. 1965లో వారెన్ బఫెట్ ఈ టెక్స్‌టైల్ కంపెనీలో పెట్టుబడి పెట్టేప్పుడు, దాని షేర్ ధర $20 కంటే తక్కువగా ఉండడం విశేషం.

Also Read: Watch Video: 5 నిమిషాల్లోనే సిద్ధం.. పెట్రోల్ ముచ్చటే లేదు.. బ్యాగ్‌లో పట్టే ఈ స్కూటర్ ఫీచర్లు చూస్తే పరేషానే..

Infosys : ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌పై కేంద్రానికి ఫిర్యాదు.. ఆందోళనలో ఉద్యోగులు..