Watch Video: 5 నిమిషాల్లోనే సిద్ధం.. పెట్రోల్ ముచ్చటే లేదు.. బ్యాగ్‌లో పట్టే ఈ స్కూటర్ ఫీచర్లు చూస్తే పరేషానే..

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ స్కూటర్ల హవానే కనిపిస్తోంది. అయితే, ప్రస్తుతం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం అందర్ని ఆకట్టుకుంటోంది. ఇందులో గాలి కూడా ఉంటుంది. సాఫ్ట్ రోబోటిక్స్, ఎలక్ట్రిక్ పర్సనల్ మొబిలిటీ సంయుక్తంగా తీసుకొచ్చిన..

Watch Video: 5 నిమిషాల్లోనే సిద్ధం.. పెట్రోల్ ముచ్చటే లేదు.. బ్యాగ్‌లో పట్టే ఈ స్కూటర్ ఫీచర్లు చూస్తే పరేషానే..
Poimo Inflatable Electric Scooter
Follow us
Venkata Chari

|

Updated on: Apr 20, 2022 | 3:58 PM

గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల(electric scooter) ట్రెండ్ విపరీతంగా పెరిగింది. ప్రజలు క్లీన్ అండ్ గ్రీన్ మొబిలిటీ వైపు కదులుతున్నారు. స్కూటర్ మీ ప్రయాణ సమయం, దూరం రెండింటినీ తగ్గిస్తుంది. స్కూటర్‌లో పెట్రోల్ నింపాల్సిన అవసరం లేదా పార్క్ చేయడానికి స్థలం దొరకని విధంగా ఉంటే మాత్రం చాలా కష్టపడుతోంది. ఇలాంటి వాటిలో వ్యక్తిగత స్కూటర్‌గా Poimo చేరనుంది. ఈ స్కూటర్ కోసం మీకు పెట్రోల్ లేదా పార్కింగ్ కోసం స్థలం అవసరం లేదు. మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని మీ బ్యాగ్‌లో కూడా ఉంచుకోవచ్చు. Poimo ఎలక్ట్రిక్ స్కూటర్ సాఫ్ట్ రోబోటిక్స్, ఎలక్ట్రిక్ పర్సనల్ మొబిలిటీ సంయుక్తంగా తయారు చేశాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకతలను తెలుసుకుందాం.

ఫీచర్లు..

Poimo నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 5.5 కిలోల బరువు ఉంటుంది. ఇందులో సాఫ్ట్ రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించారు. దీని కారణంగా సురక్షితంగా, తేలికగా మారింది. అయితే, ఇందులో కేవలం ఒక్కరే ప్రయాణించగలరు. మొత్తం స్కూటర్ బరువును తగ్గించేందుకు, కంపెనీ వైర్‌లెస్ పవర్ సిస్టమ్‌ను ఉపయోగించింది. స్కూటర్‌పై కూర్చున్న వ్యక్తి దానిని సులభంగా నడపగలడు.

5 నిమిషాల్లో స్కూటర్ సిద్ధం..

దీని బాడీని థర్మోప్లాస్టిక్ పాలియురేతేన్‌తో తయారు చేశారు. ఎయిర్‌బెడ్‌లో ఉపయోగించే పదార్థం ఇదే. ఇది ముందు, వెనుక చక్రాలు, బ్యాటరీ ఎలక్ట్రిక్ మోటార్, హ్యాండిల్ బార్, వైర్‌లెస్ కంట్రోలర్‌ను కూడా అందించారు. కంపెనీ ప్రకారం, ఈ స్కూటర్ పూర్తిగా సిద్ధంగా ఉంచేందుకు దాదాపు 5 నిమిషాల సమయం పడుతుంది. ఇది మెర్కారీ R4D చే అభివృద్ధి చేసిన గాలితో నిండిన ఎలక్ట్రిక్ స్కూటర్.

స్కూటర్ నడపడానికి ముందు, ఇందులో గాలిని నింపాలి. ఆపై స్కూటర్ సిద్ధమవుతుంది. దీనికి వెనుక భాగంలో వాల్వ్ ఉంది. దాని నుంచి గాలిని తీసివేసి, ఆపై మీ బ్యాగ్‌లో కూడా ఉంచుకోవచ్చు. ఇది ఇంకా మార్కెట్‌లో అమ్మకానికి అందుబాటులో లేనందున, దీని ధర గురించి పూర్తి వివరాలు తెలియవు. ఏదైనా ఈ ఐడియా చాలా బాగుంది కదూ.

Also Read: Sukhoi Fighter Jet: భారత అమ్ములపొదలో మరో బ్రహ్మాస్త్రం.. సుఖోయ్ 30MKI ద్వారా బ్రహ్మోస్ క్షిపణి విజయవంతం

Dizo Watch S: భారత మార్కెట్లోకి డిజో నుంచి కొత్త స్మార్ట్‌ వాచ్‌.. రూ. 2 వేల లోపు అదిరిపోయే ఫీచర్లు..

చలికాలం ఖాళీ కడుపుతో వీటిని రెండు నోట్లోవేసుకుంటే.. ఆరోగ్య లాభాలు
చలికాలం ఖాళీ కడుపుతో వీటిని రెండు నోట్లోవేసుకుంటే.. ఆరోగ్య లాభాలు
ఆపద్బంధువులా వచ్చాడనుకుంటే.. ఆపదలో పడేశాడు!
ఆపద్బంధువులా వచ్చాడనుకుంటే.. ఆపదలో పడేశాడు!
ఎక్కడపడితే అక్కడుంటాయని లైట్‌ తీసుకోకండి.. లాభాలు తెలిస్తే
ఎక్కడపడితే అక్కడుంటాయని లైట్‌ తీసుకోకండి.. లాభాలు తెలిస్తే
ఈ ఒక్కమొక్క మీ ఇంట్లో ఉంటే డాక్టర్‌తో పనిలేదు..! ఎన్ని ప్రయోజనాలో
ఈ ఒక్కమొక్క మీ ఇంట్లో ఉంటే డాక్టర్‌తో పనిలేదు..! ఎన్ని ప్రయోజనాలో
పాము కోసం బావిలో దిగి, ఇద్దరు మృతి..!
పాము కోసం బావిలో దిగి, ఇద్దరు మృతి..!
రాత్రి పడుకునే ముందు వేడి నీరు తాగండి.. జరిగే మార్పులు ఊహకందవు
రాత్రి పడుకునే ముందు వేడి నీరు తాగండి.. జరిగే మార్పులు ఊహకందవు
నా సినిమా టైటిల్ నీ భర్త లాక్కున్నాడు.. దీనికి ఆన్సర్ ఏంటీ నయన్..
నా సినిమా టైటిల్ నీ భర్త లాక్కున్నాడు.. దీనికి ఆన్సర్ ఏంటీ నయన్..
పూరి చెప్పిక కాకి కథ విన్నారా.? మంచి మెసేజ్‌ తప్పక వినాల్సిందే..
పూరి చెప్పిక కాకి కథ విన్నారా.? మంచి మెసేజ్‌ తప్పక వినాల్సిందే..
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
హోంబలే ఫిల్మ్స్‌ ‘మహావతార్‌ నరసింహ’ టీజర్ వచ్చేసింది
హోంబలే ఫిల్మ్స్‌ ‘మహావతార్‌ నరసింహ’ టీజర్ వచ్చేసింది