Dizo Watch S: భారత మార్కెట్లోకి డిజో నుంచి కొత్త స్మార్ట్‌ వాచ్‌.. రూ. 2 వేల లోపు అదిరిపోయే ఫీచర్లు..

Dizo Watch S: ప్రస్తుతం మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్‌ వాచ్‌ (Smart Watch) సందడి చేస్తోంది. స్మార్ట్‌ వాచ్‌లపై వినియోగదారులు కూడా మొగ్గు చూపుతుండడంతో పెద్ద పెద్ద కంపెనీలు సైతం వీటి తయారీలోకి అడుగు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే పోటీ పెరగడంతో...

Dizo Watch S: భారత మార్కెట్లోకి డిజో నుంచి కొత్త స్మార్ట్‌ వాచ్‌.. రూ. 2 వేల లోపు అదిరిపోయే ఫీచర్లు..
Dizo S Smart Watch
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 19, 2022 | 5:18 PM

Dizo Watch S: ప్రస్తుతం మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్‌ వాచ్‌ (Smart Watch) సందడి చేస్తోంది. స్మార్ట్‌ వాచ్‌లపై వినియోగదారులు కూడా మొగ్గు చూపుతుండడంతో పెద్ద పెద్ద కంపెనీలు సైతం వీటి తయారీలోకి అడుగు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే పోటీ పెరగడంతో స్మార్ట్‌వాచ్‌ల ధరలు కూడా భారీగా తగ్గాయి. ఇలా తాజాగా ప్రముఖ గ్యాడ్జెట్‌ కంపెనీ డిజో భారత మార్కెట్లోకి కొత్త వాచ్‌ను విడుదల చేసింది. డిజో వాచ్‌ ఎస్‌ (Dizo Watch S) పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ వాచ్‌లో అద్భుతమైన ఫీచర్లను అందించారు.

రౌండ్ డయల్‌ కాకుండా రెక్టాంగులర్‌ డయల్‌తో ఈ స్మార్ట్‌ వాచ్‌ను రూపొందించారు. ఇక వాచ్‌లో ప్రత్యేకంగా రియ‌ల్ టైమ్ హార్ట్ రేట్‌, స్లీప్ మానిట‌రింగ్ స‌పోర్ట్‌తో పాటు 150 వాచ్‌ఫేసెస్‌ను అందించారు. ఈ స్మార్ట్‌ వాచ్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ డివైజ్‌లకు సపోర్ట్‌ చేసుకోవచ్చు. దీంతో పాటు ఇందులో సైక్లింగ్‌, వాకింగ్‌, రన్నింగ్‌, ఫుట్‌బాల్‌, మౌంటెనీరింగ్, యోగతో పాటు 110కి పైగా స్పోర్ట్స్‌ మోడ్స్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఈ స్మార్ట్‌ వాచ్‌ ధర రూ. 2,229 కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 1,999కే లభిస్తుంది. ఏప్రిల్‌ 26 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ వాచ్‌లో 200 ఎంఏహెచ్‌ బ్యాటరీ అందించారు. వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 10 రోజులు పనిచేస్తుంది. స్టాండ్‌బైగా 20 రోజులు నిరంతరాయంగా నడుస్తుంది. ఈ వాచ్‌ను బ్లాక్‌, గోల్డెన్ పింక్‌, సిల్వర్, బ్లూ క‌ల‌ర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఈ స్మార్ట్‌ వాచ్‌లో 200×320 పిక్సెల్స్‌తో కూడిన 1.57 ఇంచెస్‌ డిస్‌స్లేను ఇచ్చారు.

Also Read: CM YS Jagan: ముస్లింలకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇఫ్తార్‌ విందు ప్రకటన.. ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం..!

భారతసైన్యంలో ఇంటిదొంగలు.. వాట్సాప్‌ సందేశాలతో చైనా,పాక్‌కు సమాచారం చేరవేస్తునట్టు గుర్తింపు

Acharya: మెగా అభిమానులకు కనుల పండువ.. అన్న కోసం తమ్ముడు.. ఒకే వేదికపై మెగా హీరోల సందడి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో