- Telugu News Photo Gallery Technology photos Flipkart offering best offers on smart tvs in Flipkart TV Days Sale
Flipkart TV Days Sale: స్మార్ట్ టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తక్కువ ధరలో అదిరిపోయే టీవీ సొంతం చేసుకునే ఛాన్స్..
Flipkart TV Days Sale: కొత్తగా స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుంటకున్న వారికి ఫ్లిప్ కార్ట్ శుభవార్త తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ పేరుతో సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పలు టీవీలపై భారీ ఆఫర్లను అందిస్తోంది...
Updated on: Apr 19, 2022 | 4:10 PM

ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ సేల్ పేరుతో స్మార్ట్ టీవీలపై ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా స్మార్ట్ టీవీలపై బెస్ట్ ఆఫర్స్ అందిస్తోంది. తక్కువ ధరలో స్మార్ట్ టీవీలను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది.

Thomson 9A Series 40 Inch: థామ్సన్‌కు చెందిన ఈ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ డిస్కౌంట్‌లో భాగంగా రూ. 15,999కే అందుబాటులో ఉంది. దీంతో పాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ టీవీలో 24 వాట్ల స్పీకర్లు అందించారు.

Realme 32 inch: ఈ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ సేల్‌లో భాగంగా రూ. 14,999గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్‌కార్డుతో కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇక 43 ఇంచెస్ టీవీ రూ. 26,999కి అందదుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు ద్వారా రూ.2వేల తగ్గింపునకు సొంతం చేసుకుంది.

OnePlus Y1 43 inch: ఈ స్మార్ట్ టీవీ రూ. 25,999కి అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో రూ.2,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, 20వాట్ల స్పీకర్ల ఔట్‌పుట్ వంటి ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయి.

MI 4A Pro 32 Inches: ఈ స్మార్ట్ టీవీ ఆఫర్‌లో భాగంగా రూ. 16,499కి అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,250 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయొచ్చు. 43 ఇంచెస్ ధర రూ. 31,999గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.1,250 డిస్కౌంట్ లభిస్తుంది.




