AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: వాట్సాప్‌లో మరో రెండు అదిరిపోయే ఫీచర్లు.. ఇకపై మీకు నచ్చిన భాషలో..

Whatsapp: ప్రత్యర్థి కంపెనీల పోటీని ఎదుర్కోవడంలో వాట్సాప్‌ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. రకరకాల మెసేజింగ్‌ యాప్స్‌ అందబాటులోకి వచ్చి నేపథ్యంలో యూజర్లను చేజారిపోకుండా వాట్సాప్‌ ఎప్పటికప్పుడు..

Whatsapp: వాట్సాప్‌లో మరో రెండు అదిరిపోయే ఫీచర్లు.. ఇకపై మీకు నచ్చిన భాషలో..
Whatsapp Features
Narender Vaitla
|

Updated on: Apr 21, 2022 | 3:38 PM

Share

Whatsapp: ప్రత్యర్థి కంపెనీల పోటీని ఎదుర్కోవడంలో వాట్సాప్‌ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే కొంగొత్త ఫీచర్లను (Features) పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. రకరకాల మెసేజింగ్‌ యాప్స్‌ (Apps) అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో యూజర్లను చేజారిపోకుండా వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఆప్షన్స్‌ను పరిచయం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్‌. ఈ ఫీచర్లకు సంబంధించిన వివరాలను వాట్సాప్‌ బీటాఇన్ఫోలో సూచనప్రాయంగా తెలిపింది. వాట్సాప్‌ తీసుకురానున్న ఫీచర్లు ఇవే..

లాంగ్వేజ్‌ ఫీచర్‌..

వాట్సాప్‌ ఇప్పటి వరకు కేవలం ఇంగ్లిష్‌ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే తాజాగా ఇతర భాషల్లోకి కూడా అందబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది. యూజర్లకు సెట్టింగ్స్‌లోకి తమకు నచ్చిన భాషను సెలక్ట్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు సమాచారం. అయితే వాట్సాప్‌ ఈ ఆప్షన్స్‌ను ఏయే భాషలలో అందిస్తుందన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది. మొదట ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ 2.22.9.13 వెర్షన్‌ వాడే వారికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ ప్రయాత్నాలు చేస్తున్నట్లు టాక్‌. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.

వాట్సాప్‌ గ్రూప్స్‌లో పోల్‌ ఆప్షన్‌..

వాట్సాప్‌ గ్రూప్‌లో ఏదైనా ఒక విషయంపై పోలింగ్ నిర్వహించి ఇతరుల అభిప్రాయాలను తెలుసుకునే పోల్స్‌ ఫీచర్‌పై వాట్సాప్‌ గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫీచర్‌ టెస్టింగ్ చివరి దశకు చేరకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా పోల్ రూపొందించడానికి ముందు ఒక ప్రశ్నకు నమోదు చేయాల్సి ఉంటుంది. యూజర్లు ఓటు వేయడానికి మల్టీపుల్ ఆప్షన్స్‌ ఇవ్వాలి. పోల్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడుతాయి. అయితే గ్రూప్‌ అడ్మిన్‌లు పోల్‌ ఆప్షన్స్‌ను మార్చగలరా.? పోలింగ్‌కు టైం లిమిట్‌ ఉంటుందా.? అన్న వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.

Also Read: Viral Video: సరిలేరు నీకెవ్వరూ.. గజరాజు తెలివితేటలు చూసి ఫిదా అవుతున్న నెటిజనం

kissing: పెదవి ముద్దు మాటున ప్రయోజనాలు ఎన్నో.. ఆరోగ్యమే కాదు అంతకు మించి..

Kota Srinivasa Rao: నా అభిమాన హీరోయిన్ ఆమే .. ఆసక్తికర విషయం చెప్పిన కోట శ్రీనివాసరావు

భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!