Viral Video: సరిలేరు నీకెవ్వరూ.. గజరాజు తెలివితేటలు చూసి ఫిదా అవుతున్న నెటిజనం
భూమిపై నివసిస్తున్న జీవ జాతుల్లో ఏనుగు(Elephant) అతిపెద్దది. అంతే కాదు.. బలమైనవి, తెలివైనవి కూడా. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న ఎన్నో వీడియోలు ఈ విషయాలు ధ్రువీకరిస్తాయి. వాటి బలం ముందు ఏ జంతువైనా...
భూమిపై నివసిస్తున్న జీవ జాతుల్లో ఏనుగు(Elephant) అతిపెద్దది. అంతే కాదు.. బలమైనవి, తెలివైనవి కూడా. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న ఎన్నో వీడియోలు ఈ విషయాలు ధ్రువీకరిస్తాయి. వాటి బలం ముందు ఏ జంతువైనా బలాదూర్ అవ్వాల్సిందే. తొండం ఎత్తి ఘీంకరిస్తే ఎంతటి గుండె ధైర్యం గల వారైనా బెదిరిపోవాల్సిందే. వాటి రూపు, ఆకారం, నడిచొచ్చే విధానం చూస్తే వెన్నులో వణుకుపుట్టాల్సిందే. దేవాలయాల్లో ఉండే ఏనుగులు మాత్రం ఎంతో సౌమ్యంగా ఉంటాయి. మావటి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో అవి అడవిలో ఉండే ఏనుగుల విధంగా ప్రవర్తించలేవు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ ఏనుగు పెద్ద కొయ్య దుంగను తొండంతో అలవోకగా ఎత్తేసింది. అంతే కాదండోయ్.. ఆ దుంగను ఓ పొడవైన స్తంభం పై బ్యాలెన్స్ చేసి, ఔరా అనిపించింది. స్విట్జర్లాండ్ లోని బాసెల్ జూలో ఈ అరుదైన దృశ్యం జరిగింది. ఈ వీడియోను రెక్స్ చాప్ మన్ అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతే.. ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఏనుగు టాలెంట్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అశ్చర్యంతో కామెంట్లు పెడుతున్నారు.
Basel Zoo. Switzerland:
You gotta be kidding me… pic.twitter.com/77tFEEsyzX
— Rex Chapman?? (@RexChapman) April 19, 2022
Also Read
Mahabubabad: మహబూబాబాద్‌లో దారుణం.. పట్ట పగలు టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణ హత్య.. గొడ్డళ్లతో..
టీవీలో తనను తాను చూసుకుని మురిసిపోయిన కుక్క.. ఏం చేసిందంటే ??