No Loudspeakers: ఆ రాష్ట్రంలో మతపరమైన స్థలాల్లో మూగబోతున్న సౌండ్ సిస్టమ్స్.. ఇప్పటికే మథుర ఆలయంలో లౌడ్ స్పీకర్ స్విచ్ ఆఫ్
No Loudspeakers: మతపరమైన ప్రదేశాల్లో సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై ఉత్తరప్రదేశ్(Uttarpradesh) ప్రభుత్వం ఇటీవలి కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మథురలో..
No Loudspeakers: మతపరమైన ప్రదేశాల్లో సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై ఉత్తరప్రదేశ్(Uttarpradesh) ప్రభుత్వం ఇటీవలి కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మథురలో(Madhura) లౌడ్ స్పీకర్లు ఇక నుంచి మూగబోనున్నాయి. శ్రీకృష్ణ జన్మస్థానమైన శ్రీకృష్ణ ఆలయ సముదాయ.. ప్రాంగణంలో వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లు, సౌండ్ సిస్టమ్‌ల స్విచ్ ఆఫ్ చేయాలని ఆలయకమిటీ నిర్ణయించింది.
శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయ సముదాయంలోని అత్యంత ఎత్తైన మందిర భవనం భగవత్ భవన్‌పై ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్ల స్విచ్ ను బుధవారం ఆఫ్ చేసినట్లు శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్ట్, శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ సెక్రటరీ కపిల్ శర్మ తెలిపారు. ఆలయంలోని ప్రార్ధన ధ్వని ఆలయ సముదాయం నుంచి బయటకు వెళ్లకుండా ఉండేలా అతి తక్కువ ధ్వనితో సౌండ్ సిస్టమ్స్ ఉపయోగిస్తామని.. భగవత్ భవన్ ఆలయంలోని సౌండ్ సిస్టమ్‌లు ఇకపై చాలా తక్కువ వాల్యూమ్‌లో ప్లే చేయబడతాయని శర్మ చెప్పారు.
భవనంపై ఉన్న లౌడ్ స్పీకర్ స్విచ్ ఆఫ్ చేయబడిందని… మంగళ హారతి నుండి.. శ్రీకృష్ణుడికి చేసే సేవా కార్యక్రమాలలో ఇక నుంచి లౌడ్ స్పీకర్లను ఉపయోగించరని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరికి తన మతపరమైన సిద్ధాంతాల ప్రకారం తమ ఆరాధన పద్ధతిని అనుసరించే స్వేచ్ఛ ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. అంతేకాదు సోమవారం మతపరమైన ప్రదేశాలలో ఉపయోగించే సౌండ్స్ సిస్టమ్స్ నుంచి వచ్చే శబ్దం తక్కువగా ఉండేలా చూడాలని సలహా ఇచ్చారు. ఆలయాల్లో ప్రార్ధన కోసం “మైక్‌లను ఉపయోగించేవారు ..శబ్దం ఆవరణ నుండి బిగ్గరగా ఉండకూడదని.. ఆలయ ప్రాంగణం నుంచి బయటకు రాకుండా చూసుకోవాలని సూచించారు. అంతేకాదు మైక్స్ నుంచి వచ్చే శబ్దం నుంచి ఇతరులకు ఎటువంటి సమస్య ఉండకూడదు” అని సీఎం యోగీ చెప్పారు. ఇక నుంచి మతపరమైన ప్రార్ధనామందిరాల్లో కొత్త సైట్లలో మైక్‌ల ఏర్పాటుకు ఎటువంటి అనుమతి ఇవ్వకూడదని చెప్పారు.
“తగిన అనుమతి లేకుండా ఎటువంటి మతపరమైన ఊరేగింపు జరగకూడదు” అని సిఎం చెప్పారు. మతపరమైన ఊరేగింపులకు అనుమతులు ఇచ్చే ముందు, శాంతి, సామరస్యాన్ని కాపాడటానికి నిర్వాహకుడి నుండి అఫిడవిట్ తీసుకోవాలని చెప్పారు. సాంప్రదాయ మతపరమైన ఊరేగింపులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని చెప్పారు.
Also Read: Plane Crash: హైతిలో సోడా బాటిళ్ల ట్రక్కును ఢీ కొన్న చిన్న విమానం.. ఐదుగురు మృతి.. ప్రధాని సంతాపం
Lip Care Tips: ప్రతిరోజూ ఈ చిట్కాలను పాటించండి.. అందమైన పెదాలను సొంతం చేసుకోండి..