Plane Crash: హైతిలో సోడా బాటిళ్ల ట్రక్కును ఢీ కొన్న చిన్న విమానం.. ఐదుగురు మృతి.. ప్రధాని సంతాపం

Plane Crash: హైతి(Haiti) రాజధాని పోర్ట్ అవ్​ ప్రిన్స్​లో (Port Au Prince)ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విమానం దక్షిణ తీరప్రాంత నగరమైన జాక్‌మెల్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం..

Plane Crash: హైతిలో సోడా బాటిళ్ల ట్రక్కును ఢీ కొన్న చిన్న విమానం.. ఐదుగురు మృతి.. ప్రధాని సంతాపం
Small Plane Crashes
Follow us

|

Updated on: Apr 21, 2022 | 11:05 AM

Plane Crash: హైతి(Haiti) రాజధాని పోర్ట్ అవ్​ ప్రిన్స్​లో (Port Au Prince)ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విమానం దక్షిణ తీరప్రాంత నగరమైన జాక్‌మెల్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ల్యాండ్ అయ్యే సమయంలో ఓ  చిన్న సైజు విమానం క్యారీఫోర్‌లోని కమ్యూనిటీలో దిగడానికి ప్రయత్నించినప్పుడు సోడా బాటిళ్లను రవాణా చేస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. విమానం జాక్మెల్ సౌథర్న్​ కోస్టల్ సిటీకి వెళ్లే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ట్రక్కు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలపాలైన పైలట్​ పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. అయితే ఈ విమానం సిటింగ్ కెపాసిటీ ఐదు మాత్రమేనని తెలిపారు.

ఈ ఘటనపై హైతి ప్రధాని ఏరియల్ హెన్రీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిశాక హృదయం బరువెక్కిందని ట్వీట్​ చేశారు. బాధితుల కుటంబాలకు సంతాపం తెలిపారు.  విమాన ప్రమాదంలో మరణించిన వారిలో మాంట్రియాలర్ కూడా ఉన్నారు. క్యూబెక్ లిబరల్ పార్టీ సభ్యురాలు పౌలే రోబిటైల్, గమనీల్ వాల్సిన్ మరణం గురించి తనకు బుధవారం తెలిసిందని చెప్పారు. హైతీ  నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆఫీస్ విమానాన్ని సెస్నా 207గా గుర్తించింది. ప్రమాదానికి గల కారణాలు తెలియల్సి ఉంది.

Also Read: Lip Care Tips: ప్రతిరోజూ ఈ చిట్కాలను పాటించండి.. అందమైన పెదాలను సొంతం చేసుకోండి..

Relationship: బంధం బలపడానికి, మీ భార్య ఒత్తిడిని తగ్గించడానికి.. భర్త ఈ సింపుల్ చిట్కాలను పాటించండి