Mahabubabad: మహబూబాబాద్‌లో దారుణం.. పట్ట పగలు టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణ హత్య.. గొడ్డళ్లతో..
TRS councilor brutally murder: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. మానుకోట (Mahabubabad) మున్సిపాలిటీలోని
TRS councilor brutally murder: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. మానుకోట (Mahabubabad) మున్సిపాలిటీలోని 8 వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోత్ రవినాయక్ గురువారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. మహబూబాబాద్ పట్టణంలోని పత్తిపాక కాలనీలో రవి బైక్ పై వెళ్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకొని గొడ్డళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. కాగా.. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన గిరిజన కౌన్సిలర్‌ను పట్టణం నడిబొడ్డున హత్య చేయడం సంచలనంగా మారింది. కాలనీలో అప్పటికే మాటువేసిన దుండగులు ఒక్కసారిగా ఎటాక్ చేశారు. గొడ్డలితో విచక్షణారహితంగా నరికారు. తీవ్రంగా గాయపడిన రవిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రవి ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read: