AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు పెళ్లిళ్లు జరిగాయి.. మరో మహిళతో లవ్.. విషయం తెలిసిన మూడో భార్య ఏం చేసిందంటే..?

Wife killed husband: అతొనొక నిత్య పెళ్లికొడుకు.. ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు జరిగాయి.. తీరా మూడో భార్యను వదిలిపెట్టేందుకు ప్లాన్ వేశాడు.. మరో మహిళతో ప్రేమలో పడ్డాడు.. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

మూడు పెళ్లిళ్లు జరిగాయి.. మరో మహిళతో లవ్.. విషయం తెలిసిన మూడో భార్య ఏం చేసిందంటే..?
Triangle Love
Shaik Madar Saheb
|

Updated on: Apr 21, 2022 | 12:43 PM

Share

Wife killed husband: అతొనొక నిత్య పెళ్లికొడుకు.. ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు జరిగాయి.. తీరా మూడో భార్యను వదిలిపెట్టేందుకు ప్లాన్ వేశాడు.. మరో మహిళతో ప్రేమలో పడ్డాడు.. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ.. ఈ విషయం మూడో భార్యకు తెలిసింది.. ఆమెను కలవొద్దని.. మాట్లాడొద్దంటూ హెచ్చరించింది. అయినా పట్టించుకోకుండా అతను ఆమెను కలిసేవాడు. చివరకు కోపంతో భర్తను రాయితో కొట్టి చంపింది. ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) లోని రాయ్‌పూర్‌కు సమీపంలోని సరోరా బస్తీలో చోటుచేసుకుంది. సరోరాలో నివసిస్తున్న ఉమేష్ కుమార్ ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత ఇంగ్లేశ్వరి అనే మహిళను మూడో వివాహం చేసుకున్నాడు. ఆమెతో కలిసి బస్తీ ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం మరో మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఆ విషయం మూడో భార్య ఇంగ్లేశ్వరికి తెలిసింది. మరో పెళ్లి వద్దంటూ బతిమాలింది. అయినా.. భార్య మాటలను పట్టించుకోని ఉమేష్ ఈ నెల 17వ తేదీ రాత్రి ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుతూ భార్యకు కనిపించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో ఇంగ్లేశ్వరీ ఓ పెద్ద బండ రాయి తీసుకుని భర్త తలపై కొట్టింది. దెబ్బ గట్టిగా తగలడంతో ఉమేష్ అక్కడికక్కడే మరణించాడు.

ఆ తర్వాత సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకోని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం భార్య ఇంగ్లేశ్వరిపై అనుమానంతో అదుపులోకి తీసుకోని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:

Vijayawada: బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. యువతిపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత..

Russia: తగ్గేదేలే అంటున్న రష్యా.. యుద్ధం మధ్యలో అణ్వాయుధ క్షిపణి ప్రయోగం.. Watch Video