Russia: తగ్గేదేలే అంటున్న రష్యా.. యుద్ధం మధ్యలో అణ్వాయుధ క్షిపణి ప్రయోగం.. Watch Video
Russia tests nuclear-capable missile: రష్యా - ఉక్రెయిన్ మధ్య రెండు నెలల నుంచి భీకర దాడులు కొనసాగుతున్నాయి. రష్యా నిరంతర దాడులను ఉక్రెయిన్ సైన్యం కూడా ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో వ్లాదిమిర్ పుతిన్
Russia tests nuclear-capable missile: రష్యా – ఉక్రెయిన్ మధ్య రెండు నెలల నుంచి భీకర దాడులు కొనసాగుతున్నాయి. రష్యా నిరంతర దాడులను ఉక్రెయిన్ సైన్యం కూడా ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో వ్లాదిమిర్ పుతిన్ మరో అణ్వాయుధాన్ని పరీక్షించి.. పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరికలు పంపారు. బల ప్రదర్శనలో భాగంగా రష్యా కొత్త అణ్వాయుధ సామర్థ్యం గల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. ఇది మాస్కో శత్రువులను ఆలోచింపజేస్తుందంటూ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోనే సరికొత్త అణ్వాయుధ సామర్థ్యం గల క్షిపణి అంటూ వెల్లడించారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సర్మత్ అణ్వాయుధ క్షిపణిని మొదటిసారిగా వాయువ్య రష్యాలోని ప్లెసెట్స్క్ నుంచి పరీక్షించారు. దాదాపు 6,000 కి.మీ (3,700 మైళ్ళు) దూరంలో ఉన్న కమ్‌చట్కా ద్వీపకల్పంలోని లక్ష్యాలను ఛేదించినట్లు పుతిన్ సైన్యం వెల్లడించింది. సంవత్సరాలుగా అభివృద్ధిలో ఉన్న సర్మత్ పరీక్ష పశ్చిమ దేశాలను ఇరకాటంలో పెట్టేందుకే ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. కానీ తీవ్ర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో రష్యా చేసిన అణ్వాయుధ ప్రయోగంపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. కాగా.. పరీక్ష పూర్తయిన రష్యా అణు దళాల సామర్థ్యం పెరిగిందని.. కొత్త క్షిపణి పరీక్ష విజయవంతం అయిందని రోస్కోస్మోస్ స్పేస్ ఏజెన్సీ అధిపతి డిమిత్రి రోగోజిన్ పేర్కొన్నారు.
కాగా.. ఈ క్షిపణి అత్యున్నత వ్యూహాత్మక సాంకేతిక లక్షణాలను కలిగి ఉన్నట్లు పుతిన్ పేర్కొన్నారు. ఈ క్షిపణి అన్ని మార్గాలను అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. దీనికి ప్రపంచంలోనే ఏదీ సాటి లేదని.. రాబోయే కాలంలో కూడా ఉండదంటూ పుతిన్ చెప్పారు. ఈ ఆయుధం తమ దేశ సాయుధ దళాల పోరాట సామర్థ్యాన్ని బలపరుస్తుందని.. తమను దెబ్బతీయాలని చూసే వారికి వణుకుపుట్టిస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు రష్యా అణు బలగాల గురించి మాట్లాడిన పుతిన్.. తమ జోలికొస్తే.. చరిత్రలో ఎన్నడూ చూడని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పశ్చిమ దేశాలను హెచ్చరించారు.
Russia test-fires intercontinental ballistic missile days after Pentagon scraps own ICBM test over fears of escalating tensions with Moscowpic.twitter.com/3EzZ1O9T7P
— Lucas Tomlinson (@LucasFoxNews) April 20, 2022
కాగా.. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌లో రష్యా సైనికి చర్యను ప్రారంభించిన విషయం తెలిసిందే. దాదాపు పదివేల మంది రష్యా సైనికులు ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించినా.. ఇంత వరకు పెద్ద నగరాలను స్వాధీనం చేసుకోలేకపోయింది. దీంతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జపాన్ తోపాటు పలు దేశాలు ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
Also Read: