Boris Johnson: సబర్మతి ఆశ్రమంలో బ్రిటన్ ప్రధాని.. నూలు వడికిన బోరిస్ జాన్సన్..

Boris Johnson Visits Sabarmati Ashram: బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ రెండు రోజుల పర్యటన కోసం గురువారం భారత్‌కు వచ్చారు. లండన్‌ నుంచి ఆయన నేరుగా గుజరాత్‌కు చేరుకున్నారు.

Boris Johnson: సబర్మతి ఆశ్రమంలో బ్రిటన్ ప్రధాని.. నూలు వడికిన బోరిస్ జాన్సన్..
Boris Johnson
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 21, 2022 | 1:38 PM

Boris Johnson Visits Sabarmati Ashram: బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ రెండు రోజుల పర్యటన కోసం గురువారం భారత్‌కు వచ్చారు. లండన్‌ నుంచి ఆయన నేరుగా గుజరాత్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి అహ్మదాబాద్‌లో ఉన్న సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్మా గాంధీ (Mahatma Gandhi) వాడిన చరఖాపై నూలు వడికారు. జాతిపితకు ఇది గౌరవ చిహ్నం అంటూ జాన్సన్ పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచంలోనే ప్రత్యేకమైనవని, దేశం గాంధీకి ఎప్పటికీ రుణపడి ఉంటుందని విజిటర్స్‌ బుక్‌ రాశారు జాన్సన్‌. గాంధీ అందించిన సత్యం, అహింసా సిద్ధాంతం ప్రపంచానికి ఓ దిక్సూచిలాంటిదన్నారు. ఈ సందర్భంగా గాంధీ రాసిన గైడ్ టు లండ‌న్ పుస్తకాన్ని సబర్మతి ఆశ్రమ నిర్వాహకులు బోరిస్‌ జాన్సన్‌కు గిఫ్ట్‌గా అందజేశారు. బోరిస్ జాన్సన్ వెంట గుజరాత్ సీఎం భూపేష్ పటేల్ ఉన్నారు.

కాగా.. సబర్మతీ ఆశ్రమ సందర్శకుల పుస్తకంలో బోరిస్ జాన్సన్ తన సందేశాన్ని కూడా పంచుకున్నారు. భారతీయ సంప్రదాయం, మహాత్మా గాంధీ సేవలను ప్రశంసిస్తూ యూకే పీఎం పుస్తకంలో రాశారు. అసాధారణ వ్యక్తి ప్రపంచానికి.. సత్యం, అహింస లాంటివి బోధించారని.. ఆయన ఆశ్రమానికి రావడం అదృష్టం అంటూ జాన్సన్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మహత్మా గాంధీ రాసిన ‘గైడ్ టు లండన్’ అనే పుస్తకాన్ని జాన్సన్ కు సబర్మతీ ఆశ్రమం బహుమతిగా ఇవ్వనుంది. ఇది ఇప్పటివరకు ప్రచురణ కాలేదు. ఇది కాకుండా.. మహాత్మా గాంధీ శిష్యురాలు మీరాబెన్ ఆత్మకథ ‘ది స్పిరిట్స్ పిల్‌గ్రిమేజ్’ కూడా బోరిస్ జాన్సన్‌కు సబర్మతీ ఆశ్రమం ఇవ్వనుంది.

Also Read:

Smartphone Ban: ఆ యూనివర్సిటీలో ఫోన్లు నిషేధం.. తీసుకువస్తే అంతే సంగతులు.. హుకూం జారీ

Viral: నిమ్మకాయల రేట్లు తగ్గాలని ‘తంత్ర పూజ’.. ఏం బలి ఇచ్చారో తెలిస్తే ఫ్యూజులు ఔట్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!