EPFO: ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్‌ డబ్బుల విషయంలో కంపెనీ చుట్టు తిరుగుతున్నారా? ఆ పని మీరే చేసుకోవచ్చు.. ఎలాగంటే!

EPFO: ఉద్యోగం చేసేవారి ప్రతి ఒక్కరికి పీఎఫ్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన ఉద్యోగులకు ప్రావిడెంట్‌ ఫండ్‌ (PF) అకౌంట్‌ ..

EPFO: ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్‌ డబ్బుల విషయంలో కంపెనీ చుట్టు తిరుగుతున్నారా? ఆ పని మీరే చేసుకోవచ్చు.. ఎలాగంటే!
Follow us

|

Updated on: Apr 21, 2022 | 2:26 PM

EPFO: ఉద్యోగం చేసేవారి ప్రతి ఒక్కరికి పీఎఫ్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన ఉద్యోగులకు ప్రావిడెంట్‌ ఫండ్‌ (PF) అకౌంట్‌ తప్పనిసరిగ్గా ఉంటుంది. అయితే గతంలో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ఉద్యోగం మారిన సమయంలో ప్రావిడెంట్‌ ఫండ్‌ (PF)డబ్బుల కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ పెరిగిపోతుండటంతో నిబంధనలు మారిపోతున్నాయి. అలాంటి సమయంలో ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నిబంధనలలో మార్పులు చేసింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO). ఏ కంపెనీలోనైనా ఉద్యోగంలో చేరినప్పుడు, తర్వాత మానేసిన సమయంలో పీఎఫ్‌ డబ్బులు తీసుకోవాలంటే కంపెనీ హెచ్‌ఆర్‌ (HR)ను సంప్రదించాల్సి వచ్చేది. ఎందుకంటే సదరు ఉద్యోగి ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగం మానేసిన తేదీలను ధృవీకరించిన తర్వాత పీఎఫ్‌ డబ్బులు తీసుకునే సదుపాయం ఉండేది. ఇప్పుడు అలాంటి నిబంధనపై ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం మానేసినా డబ్బులు తీసుకునే హక్కు ఉద్యోగికే కల్పించింది. అంటే కంపెనీ హెచ్‌ఆర్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉండకుండానే ఉద్యోగే తన పీఎఫ్‌ డబ్బులు తీసుకోవచ్చు.

ఈపీఎఫ్‌ఓ తెలిపిన వివరాల ప్రకారం.. మీరు ఇటీవల ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లయితే మీరు విడిచిపెట్టిన తేదీని దాఖలు చేయడానికి రెండు నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పీఎఫ్‌లో కంపెనీ యజమాని చివరి పీఎఫ్‌ డబ్బులు వేసిన 2 నెలల తర్వాత మాత్రమే నవీకరించబడుతుంది.

అయితే మీరు ఏదైనా కంపెనీలో ఉద్యోగంలో నుంచి వెళ్లిపోయినట్లయితే తేదీని ధృవీకరించకపోతే పీఎఫ్‌ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోలేరు. అలాగే అకౌంట్‌ను మీరు చేరిన కొత్త కంపెనీకి బదిలీ చేసుకోలేరు. కానీ ఉద్యోగులే కంపెనీ నుంచి నిష్క్రమణ తేదీని నవీకరించే హక్కును కల్పించింది ఈపీఎఫ్‌ఓ. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. ఈ మధ్య కాలంలో పీఎఫ్‌ నిబంధనలలో చాలా మార్పులు వచ్చాయి. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే నిబంధనలు తీసుకువస్తోంది. పీఎఫ్‌ నామినీని నమోదు చేయడం, పీఎఫ్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడం, పీఎఫ్‌ నుంచి రుణం తీసుకోవడం, పీఎఫ్‌ డబ్బులు క్లెయిమ్‌ చేసుకోవడం వంటి తదితర పనులన్ని ఉద్యోగే చేసుకునే సదుపాయం ఉంది.

నిష్క్రమణ తేదీని ఎలా నమోదు చేసుకోవాలి..?

మీరు ముందుగా పీఎఫ్‌ వెబ్‌సైట్‌ పోర్టల్‌ను ఓపెన్‌ చేయాలి. తర్వాత మేనేజ్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి. డ్రాప్‌ డౌన్‌ మెనూలో Mark Exit అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అందులో పీఎఫ్‌ అకౌంట్‌ నంబర్‌ను ఎంచుకోండి. అందులో మీరు కంపెనీ నుంచి నిష్క్రమణ తేదీ, అందుకు గల కారణాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్‌ నెంబర్‌కు లింక్‌ అయిన మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ (OTP)ని నమోదు చేయాలి. తర్వాత చెక్‌బాక్స్‌ను ఎంచుకుని అప్‌డేట్‌ చేయాలి. అంతే మీ పని విజయవంతంగా పూర్తవుతుంది. కంపెనీ హెచ్‌ఆర్‌ను సంప్రదించకుండానే మీ ఇంట్లో ఉండి ఆన్‌లైన్‌లో ఈ పని పూర్తి చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Business Idea: ఈ వ్యాపారం చేస్తే రోజుకు వేలల్లో సంపాదన.. పెట్టుబడి కూడా చాలా తక్కువే..

Stock Market: దాలాల్ స్ట్రీల్ లో కొనసాగుతున్న బుల్ జోరు.. లాభాల్లో ప్రధాన సూచీలు..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి